పెళ్లి చేసుకోవడంకంటే కుక్కను పెంచుకోవడం బెటర్.. కలర్ స్వాతి సంచలన వ్యాఖ్యలు

by Mallepaka Hamsa |   (  Updated:2026-05-25 15:22:54  IST  )

ఈ రోజుల్లో ఒక మనిషిని పూర్తిగా నమ్మి, పెళ్లి చేసుకుని, జీవితాంతం కలిసి ఉండటం అనేది చాలా కష్టమైన విషయంగా మారిపోయింది.

పెళ్లి  చేసుకోవడంకంటే కుక్కను పెంచుకోవడం బెటర్.. కలర్ స్వాతి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, సినిమా: టాలీవుడ్ నటి ఒకప్పుడు ‘కలర్స్’ అనే టీవీ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై, కలర్స్ స్వాతిగా మారారు. ఆ తర్వాత తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా తెలుగులో సూపర్ హిట్ చిత్రాలతో మెప్పించిన ఆమె చివరగా ‘మంత్ ఆఫ్ మధు’ అనే సినిమాలో కనిపించారు. ఆ తర్వాత నుండి ఆమె ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉంటున్నారు. ఇక తన వ్యక్తిగత జీవితంలో కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే వివాహం చేసుకున్న స్వాతి.. ఆ తర్వాత భర్తతో వచ్చిన మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు. అప్పటి నుండి నిత్యం తన పర్సనల్ లైఫ్ విషయాలపై ఓపెన్‌గా స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా పెళ్లి, బంధాలపై ఆమె చేసిన కొన్ని బోల్డ్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారాయి.

ఓ ఇంటర్వ్యూలో స్వాతి మాట్లాడుతూ.. ప్రస్తుత రోజుల్లో రిలేషన్‌షిప్స్ ఎలా మారిపోయాయో వివరించారు. "ఈ రోజుల్లో ఒక మనిషిని పూర్తిగా నమ్మి, పెళ్లి చేసుకుని, జీవితాంతం కలిసి ఉండటం అనేది చాలా కష్టమైన విషయంగా మారిపోయింది. భాగస్వాముల మధ్య ఒకరినొకరు అర్థం చేసుకునే ఓపిక ఎవరికీ ఉండటం లేదు. అందుకే, ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుని, ప్రతిరోజూ గొడవలతో మానసిక ప్రశాంతతను పూర్తిగా కోల్పోవడం కన్నా.. హాయిగా ఒక కుక్కను పెంచుకోవడం చాలా బెటర్" అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. మనుషుల కంటే జంతువులే నమ్మకమైనవని స్వాతి అభిప్రాయపడ్డారు. "మనం పెంచుకునే మూగజీవాలు మనకు ఎప్పుడూ నమ్మకంగా ఉంటాయి. ఎలాంటి షరతులు, కండిషన్లు లేకుండా మనల్ని ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాయి. కానీ మనుషుల బంధాల్లో ఆ నమ్మకం కరువైంది" అని ఆమె చెప్పుకొచ్చారు.

సెక్స్‌ను తప్పుగా చూడటం అస్సలు కరెక్ట్ కాదు.. కామాక్షి భాస్కర్ల బోల్డ్ స్టేట్‌మెంట్

Next Story