సెక్స్‌ను తప్పుగా చూడటం అస్సలు కరెక్ట్ కాదు.. కామాక్షి భాస్కర్ల బోల్డ్ స్టేట్‌మెంట్

by Mallepaka Hamsa |

అందరూ తనలాగే ఆలోచించాలనే రూల్ లేదని కానీ, తనకు కేవలం 4 ఏళ్ల వయసు ఉన్నప్పుడే మొదటిసారి లైంగిక వేధింపులకు గురైనట్లు ఈవేదన వ్యక్తం చేసింది.

సెక్స్‌ను తప్పుగా చూడటం అస్సలు కరెక్ట్ కాదు.. కామాక్షి భాస్కర్ల బోల్డ్ స్టేట్‌మెంట్
X

దిశ, సినిమా: ‘పొలిమేర’ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చిన కామాక్షి భాస్కర్ల ఫుల్ ఫేమ్ రాబట్టుకుంది. ఆ తర్వాత చేసిన వీరూపాక్ష బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అమ్మడు రేంజ్ మారిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు ఎంఎస్ రాజు దర్శకత్వంలో రాబోతున్న ‘అగధ’తో కీలక పాత్రలో కనిపించనుంది. ఈనేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కామక్షి చేసిన బోల్డ్ స్టేట్‌మెంట్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తన చిన్నతనంలో జరిగిన ఒక భయంకరమైన చేదు అనుభవాన్ని కామాక్షి బయటపెట్టింది. అందరూ తనలాగే ఆలోచించాలనే రూల్ లేదని కానీ, తనకు కేవలం 4 ఏళ్ల వయసు ఉన్నప్పుడే మొదటిసారి లైంగిక వేధింపులకు గురైనట్లు ఈవేదన వ్యక్తం చేసింది. ఆ తర్వాత టీనేజ్‌లో కూడా మరో మూడేళ్ల పాటు దారుణమైన వేధింపులను ఎదుర్కొన్నట్లు ఎమోషనల్ అయింది. ఇంత చిన్న వయసులోనే అలాంటి నరకాన్ని, దారుణమైన పరిస్థితులను అనుభవించిన ఏ అమ్మాయికైనా తన శరీరం మీద వ్యామోహం, గౌరవం పోతాయని తెలిపింది.

అందుకే తనలో శారీరక కోరికలు, ఆకర్షణలు పూర్తిగా చచ్చిపోయాయని చెప్పుకొచ్చింది. తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ.. ఇప్పటివరకు తన లైఫ్‌లో మూడు బ్రేకప్స్ అయ్యాయని చెప్తూ.. "ఏ రిలేషన్‌లోనైనా కేవలం మన స్వార్థం మాత్రమే చూసుకోకూడదు. అవతలి వ్యక్తి అంచనాలను, ఇష్టాలను కూడా గౌరవించాలి. మా ఇద్దరి ఆలోచనలు, ఇష్టాలు వేరు వేరుగా ఉండటం వల్లే మేము విడిపోయాం" అని వివరించింది. సమాజంలో సెక్స్ అనే పదాన్ని ఒక బూతులా ఎందుకు చూస్తారో తనకు అస్సలు అర్థం కాదని కామాక్షి బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. "రెండు చేతులు కలపడం దగ్గర నుంచి సెక్స్ వరకు అన్నీ శారీరక, మానసిక శక్తుల మార్పిడి మాత్రమేనని. ఇద్దరు వ్యక్తులు మనసులోని ఆలోచనలను పంచుకోవడం గొప్పదైనప్పుడు..సెక్స్‌ను మాత్రం బూతులా చూడటం అస్సలు కరెక్ట్ కాదని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక ఈ విషయంపై నెటిజన్లు కొందరు ఆమెకు సపోర్ట్‌ చేస్తుంటే మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు.

Next Story