- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జన సైన్యాధ్యక్షుడికి విజయోస్తు..! మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
అన్న మెగాస్టార్ జన్మదినం సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ వేదికగా అడ్వాన్స్ విషెస్ చెప్పారు.

దిశ, వెబ్‌డెస్క్: అన్న మెగాస్టార్ జన్మదినం సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ వేదికగా అడ్వాన్స్ విషెస్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే పవన్ చేసిన ట్వీట్‌కు తాజాగా చిరంజీవి రిప్లై ఇచ్చారు. జన సైన్యాధ్యక్షుడికి విజయోస్తు..! తమ్ముడు కల్యాణ్.. ప్రేమతో పంపిన పుట్టిన రోజు శుభాకాంక్షలు అందాయి. ప్రతీ మాట.. ప్రతీ అక్షరం నా హృదయాన్ని తాకింది. అన్నయ్యగా నన్ను చూసి నువ్వెంత గర్విస్తున్నావో.. ఓ తమ్ముడిగా నీ విజయాల్ని, నీ పోరాటాన్ని నేను అంతగా ఆస్వాదిస్తున్నా. నీ కార్యదీక్షత, పట్టుదల చూసి ప్రతీ క్షణం గర్వపడుతూనే ఉన్నా. నిన్ను నమ్మినవాళ్లకు ఏదో చేయాలన్న తపనే నీకు ఎప్పటికప్పుడు కొత్త శక్తిని ఇస్తుంది. ఇవాళ నీ వెనుక కోట్లాది మంది జన సైనికులు ఉన్నారు. ఆ సైన్యాన్ని ఓ రాజువై నడిపించు. వాళ్ల ఆశలకు, కలలకు కొత్త శక్తినివ్వు. అభిమానుల ఆశీర్వాదం, ప్రేమ నీకు మెండుగా లభిస్తూనే ఉండాలి. ఓ అన్నయ్యగా నా ఆశీర్వచనాలు ఎప్పుడూ నీతోనే ఉంటాయి. నీ ప్రతీ అడుగులోనూ విజయం నిన్ను వరించాలని ఆ భగవంతుడిని కోరుకొంటున్నా ఇట్లు నీ అన్నయ్య అంటూ మెగాస్టార్ ట్వీట్ చేశారు. ట్వీట్
Read More..
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే.. సీఎం చంద్రబాబు స్పెషల్ ట్వీట్






