- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే.. సీఎం చంద్రబాబు స్పెషల్ ట్వీట్
చిరంజీవి (Chiranjeevi) పుట్టినరోజు సందర్భంగా తెలుగు మూవీ ఇండస్ట్రీలో పండుగ వాతావరణం నెలకొంది.

దిశ, వెబ్‌డెస్క్: చిరంజీవి (Chiranjeevi) పుట్టినరోజు సందర్భంగా తెలుగు మూవీ ఇండస్ట్రీలో పండుగ వాతావరణం నెలకొంది. రెండు తెలుగు స్టేట్స్‌లో మెగాస్టార్ (Mega Star) ఫ్యాన్స్ సంబురాలకు తెరలేపారు. అర్థరాత్రి నుంచే కేక్‌లు కట్ చేస్తూ.. పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దేశంలోని పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు చిరంజీవికి సోషల్ మీడియా వేదికగా విషెస్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ‘X’ వేదికగా మెగాస్టార్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘చిరంజీవి గారికి 70వ జన్మదిన శుభాకాంక్షలు. సినిమా, ప్రజా జీవనం, సామాజిక సేవలో మీ అద్భుతమైన ప్రయాణం లక్షలాది మందిని స్ఫూర్తిపరిచింది. మీ ఔదార్యం, అంకితభావంతో మరిన్ని జీవితాలను స్పర్శించాలని కోరుకుంటున్నా. మీకు ఆరోగ్యం, ఆనందం మరెన్నో గుర్తుండిపోయే సంవత్సరాలు ఉండాలని ఆశిస్తున్నా’ అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.
Read More..






