- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రూ.1000 కోట్లతో మాటల మాంత్రికుడు భారీ సినిమా ?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ భారీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తన పౌరాణిక చిత్రం కోసం సమయం

దిశ, వెబ్ డెస్క్: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ భారీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తన పౌరాణిక చిత్రం కోసం సమయం తీసుకున్నప్పటికీ, ఫైనల్ గా హీరోను సెలెక్ట్ చేశారట. అల్లు అర్జున్ తో తన మైథాలజీ సినిమాను చేసేందుకు త్రివిక్రమ్ సిద్ధమవుతున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ సినిమాను మొదట బన్నీతోనే చేయాలని త్రివిక్రమ్ డిసైడ్ అయ్యారు. అయితే ఏమైందో తెలియదు గానీ, చివరి క్షణంలో ఎన్టీఆర్ కు కూడా ఈ కథ చెప్పారట త్రివిక్రమ్. దీంతో సినిమాపై హైప్ అమాంతం పెరిగిపోయింది.
అయితే ఇప్పుడు మళ్లీ ఈ సినిమా అల్లు అర్జున్ వద్దకు వచ్చినట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. దాదాపు రూ.1000 కోట్లతో ఈ సినిమా చేయబోతున్నారట. సుబ్రహ్మణ్యస్వామి నేపథ్యంలో ఈ సినిమా వస్తోందని టాక్. త్రివిక్రమ్, ప్రస్తుతం వెంకటేష్ తో సినిమా చేస్తున్నారు. అటు అట్లితో అల్లు అర్జున్ బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత 2027 ఫిబ్రవరిలో లేదా మార్చిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాదట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు టాక్ నడుస్తోంది. కాగా, ఈ సినిమాను సితార, హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్ లో తీసుకు వస్తున్నట్లు తెలుస్తోంది.
Related News : దేవర 2 నుంచి బిగ్ అప్డేట్...ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పండగే






