Devara - 2 : దేవర 2 నుంచి బిగ్ అప్డేట్‌...ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పండ‌గే !

by velandi.Saikiran |   (  Updated:2025-12-25 11:02:48  IST  )

జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకు వెళ్తున్నారు జూనియర్ ఎన్టీఆర్.

Devara - 2 : దేవర 2 నుంచి బిగ్ అప్డేట్‌...ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పండ‌గే !
X

దిశ‌, వెబ్ డెస్క్: జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకు వెళ్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. అయితే ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో మెరిసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, జాన్వి హీరో హీరోయిన్లుగా చేయగా కొరటాల శివ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా మొదటి పార్ట్ పూర్తికాగా.. సీక్వెల్ త్వరలో రానుంది. దేవర 2 పేరుతో ఈ మూవీని తీసుకురానున్నారు. అయితే ఈ సినిమాను రకరకాల కారణాలవల్ల, కొరటాల శివ పక్కకు పెట్టినట్లు టాక్ నడిచింది.

ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ షెడ్యూల్ ఫుల్ బిజీగా ఉన్న నేపథ్యంలో దేవర 2 షెడ్యూల్ లేట్ అయినట్లు కూడా ప్రచారం జోరుగా సాగింది. అయితే తాజాగా ఈ సినిమా గురించి మరో అప్డేట్ వచ్చింది. ఈ సినిమాను త్వరగా ఫినిష్ చేయాలని జూనియర్ ఎన్టీఆర్ డిసైడ్ అయ్యారట. ఈ మేరకు కొరటాల శివకు సమాచారం కూడా అందించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ మూవీ త్వరలో పట్టాలెక్కనున్నట్లు టాక్ నడుస్తోంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన కూడా రానుందట.

Next Story