- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Jailer 2: జైలర్ 2 మూవీలో బాలీవుడ్ స్టార్ ..!
సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఏ సినిమా చేసినా బంపర్ హిట్

దిశ, వెబ్ డెస్క్: సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఏ సినిమా చేసినా బంపర్ హిట్ కావడం గ్యారంటీ. ఏజ్ పైబడిన కూడా వరుసగా సినిమాలు చేసుకుంటే ముందుకు సాగుతున్నారు రజినీకాంత్. అయితే అలాంటి రజినీకాంత్ జైలర్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ కావడంతో కోట్ల వర్షం కురిసింది. ఇక త్వరలో జైలర్ 2 సినిమా కూడా వస్తోంది. ఈ సినిమా పైన కూడా భారీగా అంచనాలు పెరిగిపోయాయి.
ఇలాంటి నేపథ్యంలోనే ఈ జైలర్ 2 గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మిథున్ చక్రవర్తి. ఈ సినిమాలో మిథున్ చక్రవర్తి ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. జైలర్ 2 సినిమాలో అన్ని చిత్ర పరిశ్రమలకు చెందిన బడా నటీనటులు కనిపించబోతున్నట్లు తెలిపారు. షారుక్ ఖాన్, మోహన్ లాల్, రమ్యకృష్ణ అలాగే శివరాజ్ కుమార్ లు స్పెషల్ రోల్ లో కనిపిస్తారని ఆయన వెల్లడించారు. దీంతో ఈ ప్రాజెక్టులో షారుక్ ఖాన్ ఉన్నట్లు అధికారికంగా ప్రకటన చేసినట్లు అయింది.
Related News : దేవర 2 నుంచి బిగ్ అప్డేట్...ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పండగే






