త్రిష ఓ పరాన్నజీవి... షాకింగ్ కామెంట్స్ చేసిన సుచిత్ర

by Pulgam srinivas |   (  Updated:2026-05-11 10:40:46  IST  )

సుచిత్ర మాట్లాడుతూ... విజయ్ ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నారని ఇలాంటి సమయంలోనే “పరాన్నజీవులు” లాంటి వ్యక్తులు ఆయన జీవితంలోకి ప్రవేశిస్తున్నారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది.

త్రిష ఓ పరాన్నజీవి... షాకింగ్ కామెంట్స్ చేసిన సుచిత్ర
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలలో స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పిన బ్యూటీలలో త్రిష ఒకరు. ఈమె ఇప్పటికీ కూడా అద్భుతమైన రీతిలో సినిమా అవకాశాలను దక్కించుకుంటూ కెరీర్‌ను ముందుకు సాగిస్తుంది. తమిళ స్టార్ హీరో విజయ్ మరియు త్రిష ఈమధ్య సన్నిహితంగా ఉంటున్న విషయం తెలిసిందే. విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి అద్భుతమైన స్థాయిలో విజయాన్ని అందుకొని తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా అయ్యారు. నిన్న ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సందర్భంలో కూడా ఈమె హాజరు కావడం జరిగింది. ఇంతలా ఈమె విజయ్‌కు దగ్గరగా ఉంటుండడంతో కొంతమంది ఈ విషయంపై ఘాటుగా స్పందిస్తున్నారు.

ఇక తాజాగా సుచిత్ర కూడా త్రిష గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. సుచిత్ర తాజాగా మాట్లాడుతూ… “నాకు త్రిష అంటే ఏమాత్రం ఇష్టం ఉండదు. విజయ్ అంటే మాత్రం చాలా ఇష్టం, అభిమానం. అందుకే నా అభిప్రాయాన్ని నిష్పక్షపాతంగా చెబుతున్నాను” అంటూ చెప్పింది. విజయ్ ప్రస్తుతం తన తల్లిదండ్రులకు మరియు భార్యకు దూరమై ఒంటరిగా ఉంటున్నారని, ఇలాంటి సమయంలోనే “పరాన్నజీవులు” లాంటి వ్యక్తులు విజయ్ జీవితంలోకి ప్రవేశిస్తున్నారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. విజయ్ ప్రస్తుత ఒంటరితనాన్ని వాడుకొని కొందరు ఆయనకు భారంగా మారుతున్నారని ఈమె వ్యాఖ్యలు చేసింది. తాజాగా సుచిత్ర చేసిన ఈ వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

విజయ్ ప్రమాణ స్వీకారం తర్వాత ప్రేమ గురించి త్రిష పోస్ట్.. నెటిజన్ల రియాక్షన్ ఇదే!

జాక్ పాట్ కొట్టిన త్రిష.. మల్టీస్టారర్‌లో రూ.12కోట్ల బంపర్ ఆఫర్!

Next Story