జాక్ పాట్ కొట్టిన త్రిష.. మల్టీస్టారర్‌లో రూ.12కోట్ల బంపర్ ఆఫర్!

by Mallepaka Hamsa |   (  Updated:2026-05-11 07:46:57  IST  )

ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం త్రిషకు ఏకంగా రూ. 12 కోట్ల పారితోషికం ఆఫర్ చేసినట్లు సమాచారం. ఒక హీరోయిన్‌కు ఈ స్థాయిలో రెమ్యునరేషన్ ఇవ్వడం దక్షిణాదిలో ఇదే మొదటిసారి అని టాక్ వినిపిస్తోంది.

జాక్ పాట్ కొట్టిన త్రిష.. మల్టీస్టారర్‌లో రూ.12కోట్ల బంపర్ ఆఫర్!
X

దిశ, సినిమా: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ బ్యూటీగా వెలిగిపోతున్న త్రిష పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలోమార్మోగిపోతోంది. ఒకవైపు ఆమె వ్యక్తిగత జీవితం, మరోవైపు భారీ ప్రాజెక్టులతో త్రిష వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా దళపతి విజయ్ రాజకీయ ప్రస్థానంలో త్రిష స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవడం, ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేడుకలో ఆమె సందడి చేయడం తమిళ రాజకీయాల్లోనూ, సినీ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. త్రిష త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతుందనే పుకార్లు షికారు చేస్తున్నప్పటికీ, ఆమె మాత్రం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన ‘విశ్వంభర’ చిత్రంలో నటిస్తున్న త్రిషకు, ఇప్పుడు ఒక కలలో కూడా ఊహించని భారీ ఆఫర్ వచ్చినట్లు సమాచారం. భారతీయ సినీ దిగ్గజాలు కమల్ హాసన్, రజినీకాంత్ దశాబ్దాల తర్వాత కలిసి నటించబోతున్న మల్టీస్టారర్ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది. క్రేజీ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ భారీ చిత్రాన్ని రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్‌పై ఉదయనిధి స్టాలిన్ నిర్మిస్తున్నారు.

అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఒక ప్రోమో సాంగ్ ఇప్పటికే విడుదలై రికార్డులు సృష్టిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం త్రిషకు ఏకంగా రూ. 12 కోట్ల పారితోషికం ఆఫర్ చేసినట్లు సమాచారం. ఒక హీరోయిన్‌కు ఈ స్థాయిలో రెమ్యునరేషన్ ఇవ్వడం దక్షిణాదిలో ఇదే మొదటిసారి అని టాక్ వినిపిస్తోంది. త్రిష గతంలో కమల్ హాసన్‌తో మన్మధన్ అన్బు, తూంగావనం, థగ్ లైఫ్ వంటి సినిమాల్లో నటించింది. ఇప్పుడు మళ్ళీ కమల్, రజినీ వంటి లెజెండ్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటం ఆమె కెరీర్‌లోనే ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. మరో రెండు నెలల్లో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుందని తెలుస్తోంది. త్రిష క్రేజ్ చూస్తుంటే ఆమె సెకండ్ ఇన్నింగ్స్‌లో మొదటి ఇన్నింగ్స్ కంటే వేగంగా దూసుకుపోతోందని అర్థమవుతోంది.

త్రిష ఓ పరాన్నజీవి... షాకింగ్ కామెంట్స్ చేసిన సుచిత్ర

Next Story