- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయ్ ప్రమాణ స్వీకారం తర్వాత ప్రేమ గురించి త్రిష పోస్ట్.. నెటిజన్ల రియాక్షన్ ఇదే!
ఈ విమర్శలకు త్రిష తనదైన శైలిలో గట్టి సమాధానం ఇచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తాను ప్రమాణ స్వీకారానికి ధరించిన నీలిరంగు కాంచీవరం చీరలో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ పోస్ట్ పెట్టింది.

దిశ, సినిమా: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) 108 సీట్లు సాధించి ఘనవిజయం అందుకున్న విషయం తెలిసిందే. దశాబ్దాలుగా కొనసాగుతున్న ద్రావిడ పార్టీల పాలనకు చెక్ పెట్టి విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. త్రిష మొదటి నుంచీ విజయ్‌కు గట్టి మద్దతుదారుగా ఉంటూ వస్తోంది. ఎన్నికల కౌంటింగ్ రోజున కూడా ఆమె విజయ్‌కు తన మద్దతు ప్రకటించింది. అంతేకాకుండా, మే 4న తన 43వ పుట్టినరోజు సందర్భంగా తిరుపతిలో దర్శనం చేసుకుని వచ్చిన త్రిష, నేరుగా విజయ్ నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలపడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇక తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం, ఇప్పుడు సినీ వర్గాల్లోనూ హాట్ టాపిక్ అయింది. మే 10న జరిగిన ఈ చారిత్రాత్మక వేడుకకు స్టార్ హీరోయిన్ త్రిష హాజరుకావడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.
ముఖ్యంగా విజయ్ భార్య సంగీత, పిల్లలు ఈ వేడుకకు దూరంగా ఉండటం,త్రిష మాత్రం విజయ్ తల్లిని హగ్ చేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇక ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. పలు పుకార్లు వస్తున్న నేపథ్యంలో నెటిజన్లు ఆమెను టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేశారు. ఈ విమర్శలకు త్రిష తనదైన శైలిలో గట్టి సమాధానం ఇచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తాను ప్రమాణ స్వీకారానికి ధరించిన నీలిరంగు కాంచీవరం చీరలో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ.. “ప్రేమ ఎప్పుడూ గొప్పగా వినిపిస్తుంది’’ అంటూ ఒక క్రిప్టిక్ క్యాప్షన్ ఇచ్చింది. ప్రేమే గొప్పదని ఆమె పరోక్షంగా ట్రోలర్ల నోళ్లు మూయించింది. ఆ నీలిరంగు చీరలో, మల్లెపూలు పెట్టుకుని ఎంతో హుందాగా కనిపించిన త్రిష ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇక త్రిష పోస్ట్ చూసిన వారంతా ట్రోల్ చేస్తున్నారు. విజయ్ భార్య సంగీత జీవితాన్ని నాశనం చేయోద్దని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం ఆయన పిల్లల గురించైనా ఆలోచించమని సలహా ఇస్తున్నారు. అభిమానులు మాత్రం ఆమె అందాన్ని పొగుడుతున్నారు.






