- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మారిన తెలుగు మేకర్స్ తీరు.. ‘పెద్ది’, ‘డ్రాగన్’తో క్లియర్‌గా అర్థమవుతుంది
గత కొంతకాలంగా తెలుగు ఫిలిం మేకర్స్ ప్రచార చిత్రాల ద్వారానే సినిమా కథ, జోనర్‌పై ప్రేక్షకులకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: కొన్ని సంవత్సరాలతో పోలిస్తే ప్రస్తుతం తెలుగు సినిమా ఫిలిం మేకర్స్ మైండ్‌సెట్ మారుతూ వస్తోంది. ముఖ్యంగా ప్రమోషన్ల విషయంలో వారు భారీ స్థాయిలో అప్‌డేట్ అవుతున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం ట్రైలర్ల నిడివి సాధారణంగా రెండు నిమిషాల వరకు మాత్రమే ఉండేది. దీంతో చాలామంది ప్రేక్షకులు ట్రైలర్లలో హీరోల బిల్డప్ షాట్స్, కొన్ని యాక్షన్ సన్నివేశాలు మాత్రమే చూపిస్తున్నారని, కానీ సినిమా కథ ఎలా ఉండబోతుందనే క్లారిటీ ఇవ్వడం లేదని అభిప్రాయపడేవారు.
అయితే ఈ మధ్యకాలంలో పరిస్థితి మారుతోంది. ట్రైలర్ బాగుండటమే కాకుండా, సినిమా కథ లేదా జానర్‌పై కొంత స్పష్టత ఇస్తే ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి సినిమా చూడడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో టీజర్, ట్రైలర్, గ్లింప్స్ రూపంలో ప్రచార వీడియోలను విడుదల చేస్తూ కథకు సంబంధించిన కొంత సమాచారం ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. రేపు రామ్ చరణ్ హీరోగా రూపొందిన పెద్ది సినిమా ట్రైలర్ విడుదల కానుంది. ఈ ట్రైలర్ 3 నిమిషాల 4 సెకండ్ల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది.
దీంతో ఈ ట్రైలర్ ద్వారా సినిమా కథపై ప్రేక్షకులకు మంచి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఇక మే 20న జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్-నీల్ (NTRNeel) చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ వీడియో విడుదల కానుంది. ఈ వీడియో ఏకంగా 4 నిమిషాల 35 సెకండ్ల రన్‌టైమ్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. దీంతో తొలి వీడియో ద్వారానే మూవీ కథ లేదా మూవీ వరల్డ్ పై ప్రేక్షకులకు ఒక ఐడియా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే తెలుగు ఫిలిం మేకర్స్ ఇప్పుడు భారీ నిడివి ఉన్న ప్రచార వీడియోలను విడుదల చేస్తూ సినిమా కథపై ప్రేక్షకులకు ముందుగానే ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది.






