- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టాక్సిక్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఎప్పుడు ఎక్కడ, అంటే?
కన్నడ రాకింగ్ స్టార్ యష్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టాక్సిక్’.

దిశ, సినిమా: కన్నడ రాకింగ్ స్టార్ యష్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టాక్సిక్’. ఇందులో నుంచి ఇప్పటికే వచ్చిన గ్లింప్స్, టీజర్, సాంగ్స్‌తో పాటు.. రీసెంట్‌గా లేడీస్ అండ్ లేడీస్ అంటూ రిలీజ్ చేసిన స్పెషల్ గ్లింప్స్ సినిమాపై విపరీతమైన హైప్‌ను క్రియేట్ చేసింది. ఇప్పుడు ఇదే జోష్‌తో ‘టాక్సిక్’ టీమ్ ప్రమోషన్స్‌లో జోరు పెంచి అదిరిపోయే అప్డేట్‌ను ఇచ్చింది. ఈ మేరకు ఈ సినిమా ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్. ట్రైలర్‌ను ఆగస్టు 8న బెంగళూరులో జరిగే ఒక భారీ కార్యక్రమంలో విడుదల చేయనున్నట్లు టాక్. ఈ ట్రైలర్‌తో సినిమాపై ఉన్న అంచనాలు తదుపరి స్థాయికి చేరుకుంటాయని అభిమానులు ఆశిస్తుండగా.. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్టులు వైరల్ అవుతున్నాయి.
కాగా.. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. నయనతార, హూమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ మూవీ ఆగస్టు 26న తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ, ఇంగ్లీష్ భాషల్లో ఏకకాలంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు వచ్చేందుకు సిద్ధం అవుతున్నది.






