సెన్సార్‌కు వెళ్లినా తగ్గని బుచ్చి బాబు ఫోకస్

by Pulgam srinivas |   (  Updated:2026-05-17 06:34:44  IST  )

పెద్ది సినిమాను సెన్సార్‌కు పంపిన తర్వాత కూడా రన్‌టైమ్‌ను తగ్గించాలని బుచ్చిబాబు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

సెన్సార్‌కు వెళ్లినా తగ్గని బుచ్చి బాబు ఫోకస్
X

దిశ, వెబ్ డెస్క్: రామ్ చరణ్ హీరోగా రూపొందిన పెద్ది చిత్రానికి బుచ్చిబాబు దర్శకత్వం వహించారు. ఈ సినిమాను జూన్ 4న విడుదల చేయనున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే మూవీ బృందం ఈ చిత్రాన్ని సెన్సార్‌కు పంపినట్లు సమాచారం. సుమారు మూడు గంటల పది నిమిషాల నిడివితో చిత్రాన్ని సెన్సార్‌కు సమర్పించినట్లు తెలుస్తోంది. అయితే సెన్సార్‌కు పంపిన తర్వాత కూడా దర్శకుడు బుచ్చిబాబు రన్‌టైమ్‌ను మరికొన్ని నిమిషాలు తగ్గించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఫైనల్‌గా ఈ సినిమాను దాదాపు మూడు గంటల నిడివితో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమా ట్రైలర్‌ను రేపు విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. నిన్న చిరంజీవి ట్రైలర్‌ను చూసి అద్భుతంగా ఉందని చెప్పాడు. దాంతో ఈ ట్రైలర్ పై అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీమియర్ షోలను జూన్ 3న భారీ స్థాయిలో ప్రదర్శించనున్నట్లు తెలుస్తోంది. వాటికి మంచి టాక్ వస్తే ఈ మూవీ భారీ ఓపెనింగ్స్‌ను సొంతం చేసుకోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, జగపతిబాబు, శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

మారిన తెలుగు మేకర్స్ తీరు.. ‘పెద్ది’, ‘డ్రాగన్’తో క్లియర్‌గా అర్థమవుతుంది

Next Story