ఆ క్రేజీ చిత్రంలో గెస్ట్ రోల్‌లో తారక్?

by Pulgam srinivas |   (  Updated:2026-05-17 06:35:32  IST  )

రవితేజ హీరోగా నటిస్తున్న ‘ఇరుముడి’ చిత్రంలో తారక్ కీలక పాత్రలో కనిపించే అవకాశం ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఆ క్రేజీ చిత్రంలో గెస్ట్ రోల్‌లో తారక్?
X

దిశ, వెబ్ డెస్క్: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్న తారక్. మరో టాలీవుడ్ హీరో సినిమాలో అతిథి పాత్రలో కనిపించబోతున్నారనే వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియ భవాని శంకర్ హీరోయిన్‌గా కనిపించనుండగా, శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రంలో రవితేజ అయ్యప్ప భక్తుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో ఓ కీలక పాత్ర ఉండగా, ఆ పాత్ర కోసం మేకర్స్ తారక్‌ను సంప్రదించినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ‘ఇరుముడి’లో కీలకమైన అతిథి పాత్రలో తారక్ కనిపించే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ నిజంగానే తారక్ ఈ చిత్రంలో భాగమైతే సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశముందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మారిన తెలుగు మేకర్స్ తీరు.. ‘పెద్ది’, ‘డ్రాగన్’తో క్లియర్‌గా అర్థమవుతుంది

Next Story