ఎట్టకేలకు ఆ హీరోతో పెళ్లి రూమర్స్ పై స్పందించిన హీరోయిన్.. లవ్ మ్యారేజే చేసుకుంటా అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Gugulothu.Kavitha |   (  Updated:2026-01-06 07:29:27  IST  )

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మీనాక్షి చౌదరి ప్రజెంట్ వరుస సినిమాల్లో నటిస్తోంది.

ఎట్టకేలకు ఆ హీరోతో పెళ్లి రూమర్స్ పై స్పందించిన హీరోయిన్.. లవ్ మ్యారేజే చేసుకుంటా అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మీనాక్షి చౌదరి ప్రజెంట్ వరుస సినిమాల్లో నటిస్తోంది. అందులో న‌వీన్ పొలిశెట్టి (Naveen Polishetty) హీరోగా న‌టిస్తున్న అన‌గ‌న‌గా ఒక రాజు (Anaganaga Oka Raju) సినిమా ఒకటి. ఈ చిత్రానికి మారి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. సితార ఎంట‌ర్‌టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. అలాగే శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో వస్తోన్న ఈ చిత్రాన్ని ఫార్చ్యూన్ ఫోర్‌ సినిమాస్‌ కో ప్రొడ్యూస్ చేస్తుంది.

మిక్కీ జే మేయర్‌ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా.. జ‌న‌వరి 14న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఇందులో భాగంగా వరుస ప్రమోషన్స్ చేస్తూ మూవీపై హైప్ పెంచుతున్నారు చిత్రబృదం. ఇందులో భాగంగా తాజాగా మీనాక్షి చౌదరి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని టాలీవుడ్ హీరోతో పెళ్లి పై వస్తున్న రూమర్స్ పై స్పందించింది.

ఆమె మాట్లాడుతూ.. ‘నేను పెళ్లి చేసుకోబోతున్నానని ఎన్నో వార్తలు చూశాను. నిజంగా ఈ రూమర్స్ విని అలసిపోయాను. వాటిలో ఎలాంటి నిజం లేదు. నేను ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచనలో లేను.. కానీ లవ్ మ్యారేజే చేసుకుంటా. ప్రస్తుతం వ్యక్తిగత జీవితంపై వచ్చే గాసిప్పులను పక్కనపెట్టి, ప్రస్తుతం నా పూర్తి దృష్టి సినిమాలపైనే ఉంది’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Read More..

Upasana: పుకార్లకు చెక్ పెట్టిన ఉపాసన.. సోషల్ మీడియాలో ఆ ఫొటో వైరల్!

Meenakshi Chaudhary : పాత్ర సవాలుగా మారింది..

Next Story