Meenakshi Chaudhary : పాత్ర సవాలుగా మారింది..

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-05 08:40:24  IST  )

యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Meenakshi Chaudhary :   పాత్ర సవాలుగా మారింది..
X

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ‘లక్కీ భాస్కర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి వరుస విజయాలతో తన కెరీర్‌ను గట్టిగా ట్రాక్‌లో పెట్టుకుంది. అవకాశాలు వస్తే చాలు వాటిని మిస్ కాకుండా క్యాచ్ చేస్తూ, ఒక్కో సినిమాతో తన ఫ్యాన్ బేస్‌ను వేగంగా పెంచుకుంటోంది. ఇదే ఫామ్‌లో ఇప్పుడు ఆమె ‘అనగనగా ఒక రాజు’ (Anaganaga Oka Raju)సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. నవీన్ పొలిశెట్టితో జోడీగా నటిస్తున్న ఈ చిత్రం కల్యాణ్‌ శంకర్‌ (Kalyan Shankar)దర్శకత్వం తెరకెక్కింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవరనాగవంశీ నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలోకి రానుంది. తాజాగా సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న మీనాక్షి తన పాత్ర గురించి ఓపెన్‌గా మాట్లాడింది.

“ఈ సినిమాలోని పాత్ర నాకు నిజంగా సవాలుగా అనిపించింది. ఎందుకంటే ఇది నా మొదటి ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా. ఆ పాత్రను సరిగ్గా పండించడానికి చాలా కష్టపడ్డాను. ప్రేక్షకులు ఎప్పుడూ బెస్ట్‌కే అర్హులు అనే నమ్మకంతోనే పని చేశాను. అంతా కలిసి ఇంత కృషి చేశాం కాబట్టి ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుందని అనుకుంటున్నాం” అని చెప్పింది.ఇక భవిష్యత్తులో ఎవరితో పని చేయాలనుకుంటున్నారని అడిగితే, మీనాక్షి ఇచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. “రాజమౌళి, మణిరత్నం వంటి వారితో పనిచేయడం నా డ్రీమ్.. అలాగే నాగ అశ్విన్ గారితో పని చేయాలనుకుంటున్నాను. అలాంటి పెద్ద లిస్ట్ ఉంది. ఇంకా టైమ్ ఇస్తే మొత్తం పేర్లే చెప్పేస్తాను” అంటూ సరదాగా చెప్పింది. మొత్తానికి, వరుస విజయాలతో దూసుకుపోతున్న మీనాక్షి చౌదరి ‘అనగనగా ఒక రాజు’తో తన పాపులారిటీని మరింత పెంచుకుంటుందా అన్న ఆసక్తి ఇప్పుడు సినీ వర్గాల్లో నెలకొంది.

Read More..

మరో టాలీవుడ్ హీరోతో రొమాన్స్ చేయబోతున్న కాంతార బ్యూటీ..?


Next Story