- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరో టాలీవుడ్ హీరోతో రొమాన్స్ చేయబోతున్న కాంతార బ్యూటీ..?
బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్‌లో పెట్టిన హీరో శర్వానంద్(Sharwanandh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్‌లో పెట్టిన హీరో శర్వానంద్(Sharwanandh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆయన నటిస్తోన్న చిత్రాల్లో‘నారి నారి నడుమ మురారి’(Nari Nari Naduma Murari) ఒకటి. సామజవరగమన ఫేం రామ్ అబ్బరాజు(Ram Abbaraju) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంయుక్తా మీనన్(Samyukatha Menon), సాక్షి వైద్య(Sakshi Vaidhya) హీరోయిన్లుగా నటిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న రిలీజ్ కానుంది.
ఇదిలా ఉంటే.. దర్శకుడు శ్రీను వైట్ల – హీరో శర్వానంద్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుందట. ఈ సినిమాలో రుక్మిణీ వసంత్‌ను హీరోయిన్‌గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మార్చి నుంచి స్టార్ట్ కాబోతుందట. కాగా, గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ ‘విశ్వం’ యావరేజ్‌గా నిలిచింది. దీంతో, ఎలాగైనా మళ్ళీ తన తర్వాత సినిమాతో హిట్ ఇవ్వాలనే థాట్‌తో శ్రీనువైట్ల తెగ కష్ట పడుతున్నాడు. ఇక కథ విషయానికి వస్తే.. తెలియని వయసులో ఆవేశంలో చేసిన ఓ పని కారణంగా హీరో లైఫ్‌లో జరిగే డ్రామా.. దాని నుంచి అతను ఎలా బయట పడుతాడనేది స్టోరీ అంట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read More..






