- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అలాంటి మహిళలే నిజమైన అందగత్తె.. అనసూయ సెన్సేషనల్ పోస్ట్!
యాంకర్ అనసూయ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.

దిశ,వెబ్‌డెస్క్: యాంకర్ అనసూయ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నటి అనసూయ జబర్దస్త్ తో అటు ప్రేక్షకుల్లోనూ, ఇటు యూత్ లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించిన తర్వాత అనసూయ సినీ కెరిర్ మలుపు తిరిగింది. అప్పటి నుంచి వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా మారిపోయింది. వరుస సినిమా ఆఫర్లతో బుల్లితెరకు గుడ్ బై చెప్పి.. వెండితెరకు మాత్రమే పరిమితమైంది. ఇక, అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియా ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు.
ఈ తరుణంలో నటి అనసూయ ఇన్‌స్టాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. తన ఉనికిని చాటుకోవడానికి ఎవరికీ సంజాయిషీ ఇచ్చుకోని మహిళే నిజమైన అందగత్తె అని ఆమె పేర్కొన్నారు. తనదైన సత్యంతో హుందాగా నడుస్తూ, ఇతరులకు స్ఫూర్తినిచ్చే వెలుగును పంచే మహిళలే నిజమైన ఆదర్శమని వ్యాఖ్యానించారు. ఆత్మవిశ్వాసమే అలంకారమని, తన వ్యక్తిత్వమే విజయానికి నిదర్శనమని చెబుతూ, మహిళల సాధికారతపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే.. ఇటీవల హీరోయిన్ల వస్త్రధారణ పై నటుడు శివాజీ కామెంట్స్‌కు యాంకర్ అనసూయ తీవ్ర స్థాయిలో స్పందించిన విషయం తెలిసిందే. అయితే, ఈ వివాదంలో కొందరు శివాజీకి సపోర్ట్ చేయగా, మరికొందరు అనసూయకి మద్దతుగా పోస్టులు పెట్టారు.
Read More..
చీరలో బోల్డ్ షో చేసిన టాలీవుడ్ హీరోయిన్.. టాలెంట్ చూపిస్తున్నావా అంటూ నెటిజన్ల కామెంట్స్






