బికినీలో రెచ్చిపోయిన‌ సురేఖ‌, సుప్రీత !

by velandi.Saikiran |

సురేఖ, సుప్రీతకు ఊహించని షాక్ తగిలింది. ఈ ఇద్దరు తల్లి కూతుర్ల ఫోటోలు మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారు.

బికినీలో రెచ్చిపోయిన‌ సురేఖ‌, సుప్రీత !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఇందులో కొంతమంది మాత్రమే అతి తక్కువ కాలంలో పాపులర్ అవుతూ ఉంటారు. అలాంటి వారిలో సురేఖ వాణి ( Surekha Vani ) ఒకరు. ఈమె చేసింది చిన్నచిన్న పాత్రలు అయినప్పటికీ, ఇండస్ట్రీలో మార్క్ తెచ్చుకుంది. హీరోయిన్ అక్కగా, బ్రహ్మానందం భార్యగా, హీరో వదినగా ఇలా అనేక పాత్రలో కనిపించింది సురేఖ వాణి.

సినిమాలు చేయడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా సురేఖ వాణి ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. అటు నటి సురేఖ వాణి కూతురు సుప్రీత నాయుడు ( Supritha ) కూడా ఇదే జోరుని కొనసాగిస్తున్నారు. త్వరలోనే చౌదరి గారి అబ్బాయి తో నాయుడు గారి అమ్మాయి అనే మూవీతో సుప్రీత హీరోయిన్ గా కూడా వెండితెరకు పరిచయం కాబోతున్నట్లు టాక్ నడుస్తోంది.

అలాంటి సురేఖ, సుప్రీతకు ఊహించని షాక్ తగిలింది. ఈ ఇద్దరు తల్లి కూతుర్ల ఫోటోలు మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారు. ఇద్దరు బికినీ ధరించినట్లు కొన్ని అసభ్యకరమైన ఫోటోలు క్రియేట్ చేసి, సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు కొంతమంది దుర్మార్గులు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.దీంతో ఈ ఫోటోలపై నటి సురేఖ వాణి సీరియస్ అయినట్లు కూడా తెలుస్తోంది. అసభ్యకరమైన ఫోటోలు క్రియేట్ చేసిన వాళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేసే ఛాన్సులు ఉన్నాయి. క్లిక్

Next Story