- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Upasana: పుకార్లకు చెక్ పెట్టిన ఉపాసన.. సోషల్ మీడియాలో ఆ ఫొటో వైరల్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) సతీమణి ఉపాసన (upasana)గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) సతీమణి ఉపాసన (upasana)గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. మెగా కోడలిగానే కాకుండా తన వృత్తిపరంగా కూడా ఎంతోమంది మనసులు దోచుకుంది. చరణ్-ఉప్సీ ప్రేమించి పెళ్లి చేసుకోగా.. 11 ఏళ్ల తర్వాత తల్లిదండ్రులయ్యారు. క్లిన్‌కారా అని నామకరణం చేశారు.. కానీ ఆ పాప పుట్టి రెండేళ్లు అవుతున్నా మెగా ప్రిన్సెస్ ముఖాన్ని మాత్రం చూపించలేదు. అభిమానులు ఎంత రిక్వెస్ట్ చేసినప్పటికీ చూపించకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇక ఇటీవల ఉపాసన రెండో సారి తల్లికాబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా శ్రీమంతం కూడా ఘనంగా చేశారు. ఇక ఈ సారి డబుల్ ధమాకా అంటూ కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నట్లు మెగా ఫ్యామిలీ ప్రకటించింది.
దీంతో ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులంతా మెగా వారసుడి కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సెకండ్ ప్రెగ్నెన్సీ విషయాన్ని ప్రకటించిన ఉపాసన పెద్దగా ఎక్కడా కనిపించడం లేదు. ఈక్రమంలో.. ఉపాసన ప్రెగ్నెన్సీపై పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఉపాసన సరోగసి ద్వారా కవల పిల్లలకు జన్మనివ్వబోతుందని ప్రచారం జరుగుతోంది. అందుకే బయటకు రావడం లేదని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. ఈనేపథ్యంలో.. ఉపాసన పెద్ద బేబీ బంప్‌తో కనిపించి పుకార్లకు చెక్ పెట్టింది. రామ్ చరణ్ నివాసానికి వచ్చిన ఒసావా తన స్టైల్లో బిర్యానీ వండి వడ్డించారు. అది తిన్న గ్లోబల్ స్టార్ వండిన విధానం, సువాసన అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ఇక ఇందులో ఉపాసన ఫొటో తీస్తూ కనిపించిన మెగా కోడలి ఫొటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.






