No Entry 2 : 'నో ఎంట్రీ 2'లోకి స్టార్ నటుడు ఎంట్రీ?

by Pulgam srinivas |   (  Updated:2026-05-13 16:09:51  IST  )

'నో ఎంట్రీ 2' చిత్రంలో షాహిద్ కపూర్‌ను కూడా తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.

No Entry 2 : నో ఎంట్రీ 2లోకి స్టార్ నటుడు ఎంట్రీ?
X

దిశ, వెబ్ డెస్క్: వరుణ్ ధావన్, అర్జున్ కపూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న నో ఎంట్రీ 2 సినిమాకు అనీస్ బజ్మీ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ బాలీవుడ్ వర్గాల్లో వైరల్‌గా మారింది. ఈ మూవీలో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ కలిగిన నటుల్లో ఒకరైన షాహిద్ కపూర్‌ను కూడా తీసుకోవాలని మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయనతో సంప్రదింపులు కూడా జరిపినట్లు సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ చిత్రంలో షాహిద్ కపూర్ కూడా భాగం అయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ నిజంగానే షాహిద్ కపూర్ ఈ సినిమాలో చేరితే మూవీ రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అను మాలిక్ సంగీతం అందిస్తున్నారు.

Peddi : అన్ని నిమిషాల రన్‌టైమ్‌తో పెద్ది ట్రైలర్.. సాలిడ్ ఇంపాక్ట్ పక్కా

సమంత ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ప్రకటించిన మూవీ మేకర్స్

Next Story