- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Peddi : అన్ని నిమిషాల రన్‌టైమ్‌తో పెద్ది ట్రైలర్.. సాలిడ్ ఇంపాక్ట్ పక్కా
పెద్ది ట్రైలర్ 2 నిమిషాల 35 సెకండ్ల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వి కపూర్ హీరోయిన్‌గా, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది సినిమాను జూన్ 4న విడుదల చేయనున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్‌ను మే 18న ముంబైలో భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ట్రైలర్ ఇప్పటికే లాక్ అయినట్లు తెలుస్తోంది. ఈ ట్రైలర్ 2 నిమిషాల 35 సెకండ్ల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.
ట్రైలర్‌లో సినిమా కథ ఎలా ముందుకు సాగనుందో చూపించబోతున్నట్లు, అలాగే ప్రేక్షకులకు కథపై మంచి క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమాపై అంచనాలు అమాంతం పెరుగుతాయని మూవీ బృందం భావిస్తోంది. ఇప్పటికే ఈ ట్రైలర్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే పెద్ది ట్రైలర్‌ను ముంబైలో విడుదల చేయనున్న మూవీ టీమ్, ఆ తర్వాత తక్కువ గ్యాప్‌లోనే మే 23న భోపాల్‌లో ఐటమ్ సాంగ్‌ను విడుదల చేయనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వచ్చేసింది. ఇలా ఈ మూవీ బృందం నార్త్ ఇండియాలో ఎక్కువ స్థాయిలో ప్రమోషన్లు చేయడానికి సిద్ధమవుతోంది.






