సమంత ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ప్రకటించిన మూవీ మేకర్స్

by Mallepaka Hamsa |   (  Updated:2026-05-13 16:26:06  IST  )

తాజాగా చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా కొత్త డేట్‌ను అనౌన్స్ చేసింది. జూన్ 16న ‘మా ఇంటి బంగారం’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతుందని తెలిపారు.

సమంత ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘మా ఇంటి బంగారం’  రిలీజ్ డేట్ ప్రకటించిన మూవీ మేకర్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన సొంత బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సినిమా ‘మా ఇంటి బంగారం’. ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. నందిని రెడ్డి దర్శకత్వంలో రాబోతుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 15నే విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని సాంకేతిక కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. తాజాగా చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా కొత్త డేట్‌ను అనౌన్స్ చేసింది. జూన్ 16న ‘మా ఇంటి బంగారం’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోందని తెలిపారు. అంతేకాకుండా ఓ పోస్టర్‌‌ను విడుదల చేయగా.. ఇందులో సమంత పద్ధతిగా పట్టుచీర కట్టుకుని, చేతిలో తుపాకీ పట్టుకుని చాలా సీరియస్ లుక్‌లో కనిపిస్తోంది. ఒక పక్క గృహిణిలా కనిపిస్తూనే, మరో పక్క పవర్‌ఫుల్ యాక్షన్ మోడ్‌లో ఉండటం చూస్తుంటే, సినిమాలో ఆమె పాత్ర చాలా భిన్నంగా ఉండబోతోందని అర్థమవుతోంది. ఈ విషయం తెలుసుకున్న సమంత అభిమానులు ఆనందపడుతున్నారు.

Rukmini Vasanth : ట్రెండీ లుక్‌లో కట్టిపడేస్తున్న రుక్మిణి వసంత్

Next Story