Rukmini Vasanth : ట్రెండీ లుక్‌లో కట్టిపడేస్తున్న రుక్మిణి వసంత్

by Pulgam srinivas |   (  Updated:2026-05-13 15:51:39  IST  )

స్టైలిష్ లుక్‌లో అదరగొడుతున్న రుక్మిణి వసంత్!

Rukmini Vasanth : ట్రెండీ లుక్‌లో కట్టిపడేస్తున్న రుక్మిణి వసంత్
X

దిశ, వెబ్ డెస్క్: రుక్మిణి వసంత్ ‘సప్త సాగరాలు దాటి - చాప్టర్ 1’, ‘సప్త సాగరాలు దాటి - చాప్టర్ 2’ చిత్రాలతో ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ సినిమాల తర్వాత ఆమెకు వరుసగా పాన్ ఇండియా చిత్రాల్లో అవకాశాలు దక్కుతున్నాయి.

ఈ బ్యూటీ ఇప్పటికే ‘కాంతార చాప్టర్ 1’ చిత్రంలో హీరోయిన్‌గా నటించి తన పాపులారిటీని మరింత పెంచుకుంది. ప్రస్తుతం తారక్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ మధ్యకాలంలో రుక్మిణి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. గతంతో పోలిస్తే ఎక్కువగా తన హాట్ మరియు స్టైలిష్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటోంది.

తాజాగా ఈమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని అల్ట్రా స్టైలిష్ లుక్‌లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలలో రుక్మిణి అనేక రంగులు కలిగిన స్లీవ్‌లెస్ డ్రెస్ ధరించి, దానికి సరిపోయే చున్నీ వేసుకుని స్టైలిష్‌గా ఫోజులు ఇచ్చింది.

అలాగే తన ఎద అందాలు హైలైట్ అయ్యేలా డిఫరెంట్ యాంగిల్స్‌లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఇక డ్రెస్‌కు మ్యాచ్ అయ్యేలా ధరించిన యాక్సెసరీస్ ఆమె అందాన్ని మరింతగా హైలైట్ చేశాయి. మొత్తంగా చూసుకుంటే ఈ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో రుక్మిణి వసంత్ ఎంతో అందంగా, ఆకర్షణీయంగా కనిపించడంతో ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

Photos Courtesy: Instagram

Next Story