- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ గోల్డెన్ బ్యానర్ చేతికి ‘పెద్ది’ హక్కులు.. ఇక అక్కడ తిరుగేలేదు
‘గోల్డెన్ బ్యానర్’గా పేరొందిన హోంబలే ఫిలిమ్స్ 'పెద్ది' మూవీ ఓవర్సీస్ హక్కులను దక్కించుకుంది.

దిశ, వెబ్ డెస్క్: రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పెద్ది చిత్రాన్ని జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోలను జూన్ 3న ప్రదర్శించనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ యూనిట్ అన్ని ఏరియాల థియేటర్ హక్కులను వరుసగా అమ్ముతూ వస్తోంది. తాజాగా ఈ చిత్ర ఓవర్సీస్ హక్కులను కూడా భారీ ధరకు విక్రయించినట్లు సమాచారం. ‘గోల్డెన్ బ్యానర్’గా పేరొందిన హోంబలే ఫిలిమ్స్ ఈ మూవీ ఓవర్సీస్ హక్కులను దక్కించుకుంది. ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ సంస్థకు మంచి పట్టు ఉండటంతో సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఆ ప్రాంతం నుండి భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చే అవకాశముందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు, శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందింది.






