Peddi: మేకింగ్‌లోనే కాదు.. ప్రమోషన్స్‌లో కూడా సూపర్ ప్లాన్‌తో వెళుతున్న బుచ్చిబాబు

by Pulgam srinivas |   (  Updated:2026-05-14 10:20:31  IST  )

‘పెద్ది’ యూనిట్ మే 18 నుంచి జూన్ 2 వరకు దేశవ్యాప్తంగా అనేక ఈవెంట్లు నిర్వహించేందుకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

Peddi: మేకింగ్‌లోనే కాదు.. ప్రమోషన్స్‌లో కూడా సూపర్ ప్లాన్‌తో వెళుతున్న బుచ్చిబాబు
X

దిశ, వెబ్ డెస్క్: బుచ్చిబాబు సనా, సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుని, ఉప్పెన సినిమాతో దర్శకుడిగా కెరీర్‌ను ప్రారంభించాడు. తొలి సినిమాతోనే 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి దర్శకుడిగా తన సత్తా చాటుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ మిడ్‌రేంజ్ హీరోతో సినిమా చేస్తాడేమో అనే ఊహాగానాలు వినిపించాయి. కానీ బుచ్చిబాబు ఏకంగా రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోతో తన తదుపరి ప్రాజెక్ట్‌ను సెట్ చేసుకోవడంతో ఇండస్ట్రీలో పెద్ద చర్చ నడిచింది. అంత పెద్ద స్టార్ హీరో ఓకే చెప్పాడంటే కథ అద్భుతంగా ఉండి తీరాల్సిందేనని అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి.

ఇక ఆ తర్వాత పెద్ది షూటింగ్ ప్రారంభం కావడం, ప్రచార చిత్రాలు విడుదల కావడం, వాటికి భారీ స్థాయిలో రెస్పాన్స్ రావడం జరిగాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. జూన్ 4న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటివరకు విడుదలైన కంటెంట్‌కు అద్భుతమైన స్పందన రావడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మేకింగ్ విషయంలో పక్కా క్లారిటీతో ముందుకు వెళ్లిన బుచ్చిబాబు ప్రమోషన్స్ విషయంలో కూడా అదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్లు సమాచారం.

జూన్ 4న సినిమా విడుదల కానుండగా, జూన్ 3న ప్రీమియర్ షోలను ప్లాన్ చేస్తున్నారు. ఇక మే 18న ముంబైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. అనంతరం మే 22న హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో భారీ ఈవెంట్, మే 23న భోపాల్లో ఐటమ్ సాంగ్ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసినట్లు సమాచారం. అదేవిధంగా మే 24న బెంగళూరులో, మే 28న ఢిల్లీలో, మే 30న చెన్నైలో, జూన్ 1న విజయనగరంలో, చివరగా జూన్ 2న మరోసారి హైదరాబాద్‌లో ఈవెంట్ నిర్వహించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇలా పక్కా ప్లానింగ్‌తో ‘పెద్ది’ ప్రమోషన్స్‌ను నిర్వహించాలని బుచ్చిబాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఆ గోల్డెన్ బ్యానర్ చేతికి ‘పెద్ది’ హక్కులు.. ఇక అక్కడ తిరుగేలేదు

Next Story