‘పెద్ది’లో ఏకంగా అంతమంది హీరోయిన్లు.. చివరి నిమిషంలో పెద్ద ట్విస్ట్

by Pulgam srinivas |   (  Updated:2026-05-22 05:17:50  IST  )

‘పెద్ది’ స్పెషల్ సాంగ్‌లో శృతి హాసన్, జాన్వి కపూర్‌తో పాటు మరో హీరోయిన్ కూడా కనిపించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతోంది.

‘పెద్ది’లో ఏకంగా అంతమంది హీరోయిన్లు.. చివరి నిమిషంలో పెద్ద ట్విస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘పెద్ది’ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉండనుంది. ఈ పాటను రేపు, అంటే మే 23న భోపాల్‌లో విడుదల చేయనున్నారు. ఈ స్పెషల్ సాంగ్‌లో శృతి హాసన్, రామ్ చరణ్ కలిసి స్టెప్పులు వేశారు. ఇదే పాటలో శృతి హాసన్‌తో పాటు జాన్వి కపూర్ కూడా కనిపించబోతున్నట్లు మొదటి నుంచే వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేకాకుండా, ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు బుచ్చిబాబు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సాంగ్‌లో ఈ ఇద్దరు హీరోయిన్లతో పాటు మరో క్రేజీ బ్యూటీ కూడా కనిపించబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదే నిజమైతే, ‘పెద్ది’ సినిమాలో మొత్తం ముగ్గురు హీరోయిన్లు కనిపించనున్నట్లు అవుతుంది. దీంతో ఆ మూడో హీరోయిన్ ఎవరు? అనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

తెలంగాణ ప్రీమియర్స్ విషయంలో ‘పెద్ది’ టీం క్రేజీ డెసిషన్.. ఈసారైనా సక్సెస్ కాగలదా?

‘పెద్ది’ ఐటమ్ సాంగ్‌పై క్రేజీ అప్‌డేట్.. ఇక్కడ హిట్ అయితే అంచనాలు పీక్స్

Next Story