‘పెద్ది’ ఐటమ్ సాంగ్‌పై క్రేజీ అప్‌డేట్.. ఇక్కడ హిట్ అయితే అంచనాలు పీక్స్

by Pulgam srinivas |   (  Updated:2026-05-22 05:24:39  IST  )

'పెద్ది'లోని ‘హెల్లాళ్లల్లో’ అంటూ సాగే స్పెషల్ సాంగ్ ప్రోమోను ఈరోజు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

‘పెద్ది’ ఐటమ్ సాంగ్‌పై క్రేజీ అప్‌డేట్.. ఇక్కడ హిట్ అయితే అంచనాలు పీక్స్
X

దిశ, వెబ్ డెస్క్: రామ్ చరణ్ - జాన్వి కపూర్ జంటగా నటించిన చిత్రం ‘పెద్ది’. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మించారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రత్యేక ప్రీమియర్ షోలను జూన్ 3న ప్రదర్శించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. రేపు భోపాల్‌లో మూవీ యూనిట్ ప్రత్యేక ఈవెంట్ నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో చిత్రంలోని మూడో పాటను విడుదల చేయనున్నారు. ఇది సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే స్పెషల్ సాంగ్‌గా ఉండబోతోందని సమాచారం. ‘హెల్లాళ్లల్లో’ అంటూ సాగే ఈ స్పెషల్ సాంగ్ ప్రోమోను ఈరోజు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దీంతో ఈ పాటపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఈ ఐటమ్ సాంగ్‌లో శృతి హాసన్ కనిపించనుండటంతో అంచనాలు మరింత పెరిగాయి. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు, శివరాజ్‌కుమార్, దివ్యేందు, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

తెలంగాణ ప్రీమియర్స్ విషయంలో ‘పెద్ది’ టీం క్రేజీ డెసిషన్.. ఈసారైనా సక్సెస్ కాగలదా?

‘పెద్ది’లో ఏకంగా అంతమంది హీరోయిన్లు.. చివరి నిమిషంలో పెద్ద ట్విస్ట్

Next Story