- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ ప్రీమియర్స్ విషయంలో ‘పెద్ది’ టీం క్రేజీ డెసిషన్.. ఈసారైనా సక్సెస్ కాగలదా?
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం తెలంగాణలో జూన్ 3న రాత్రి 8 గంటల నుంచి ‘పెద్ది’ ప్రీమియర్ షోలను ప్రదర్శించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని మూవీ మేకర్స్ కోరినట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ చిత్రాన్ని జూన్ 4న విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోలను జూన్ 3న భారీ స్థాయిలో ప్రదర్శించనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ప్రీమియర్స్ విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో గత కొంతకాలంగా పెద్దగా ఇబ్బందులు ఎదురుకావడం లేదు. ప్రభుత్వాలు కూడా సానుకూలంగా స్పందిస్తూ మేకర్స్‌కు సహకరిస్తుండటంతో ప్రత్యేక షోలను ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రదర్శిస్తున్నారు.
అయితే తెలంగాణలో మాత్రం ప్రీమియర్స్ విషయంలో మేకర్స్‌కు కొంతమేర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ‘పెద్ది’ చిత్రానికి సంబంధించిన ప్రీమియర్ షోలు తెలంగాణలో ప్రదర్శితమవుతాయా? లేదా? అనే అంశం ప్రేక్షకుల్లో ఆసక్తి, ఉత్కంఠను పెంచుతోంది. ఇక ఈ సినిమాను తెలంగాణలో మైత్రి సంస్థ విడుదల చేయనుంది. ఇటీవల మైత్రి సంస్థ విడుదల చేసిన పలు పెద్ద సినిమాల ప్రీమియర్స్ విషయంలో అనేక అడ్డంకులు, ఇబ్బందులు ఎదురైన విషయం తెలిసిందే.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం తెలంగాణలో జూన్ 3న రాత్రి 8 గంటల నుంచి ‘పెద్ది’ ప్రీమియర్ షోలను ప్రదర్శించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని మూవీ మేకర్స్ కోరినట్లు తెలుస్తోంది. ఒకవేళ ప్రభుత్వం నుంచి అనుకూలంగా అనుమతులు లభిస్తే తెలంగాణవ్యాప్తంగా జూన్ 3 రాత్రి 8 గంటల నుంచే భారీ స్థాయిలో ప్రీమియర్ షోలు ప్రదర్శించే అవకాశం ఉంది. మరి తెలంగాణలో ‘పెద్ది’ ప్రీమియర్ షోల సస్పెన్స్ ఎప్పుడు వీడనుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందేనని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.






