- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శివాజీకి చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్..నువ్వు కూడా ధోతీ కట్టుకో అంటూ!
నటుడు శివాజీ చేసిన కామెంట్లకు సింగర్ చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మహిళలను చీరలు కట్టుకోమని

దిశ, వెబ్ డెస్క్: దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు శివాజీ చేసిన కామెంట్లకు సింగర్ చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మహిళలను చీరలు కట్టుకోమని చెప్పిన ఆయన, ధోతీలు కట్టుకోవాలని ఘాటుగా స్పందించారు. దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శివాజీ మాట్లాడిన మాటలు చాలా దారుణంగా ఉన్నాయని చిన్మయి ఫైర్ అయ్యారు. ఓ మంచి సినిమాలో విలన్ పాత్ర పోషించిన శివాజీ, పోకిరి బ్యాచ్ కు హీరో అయిపోయాడని పరువు తీశారు.
ఇప్పుడు అదే పోకిరి భాషతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మహిళ అంటే చీరే కట్టుకోవాలా ? మరి జీన్స్, హుడీలు శివాజీ ఎందుకు ధరిస్తున్నాడని నిలదీశారు. భారత సాంప్రదాయం ప్రకారం, అతను కూడా ధోతి మాత్రమే ధరించి, బొట్టు కూడా పెట్టుకోవాలని చురకలు అంటించారు. అతనికి పెళ్లి అయితే, చేతికి కంకణం, మెట్టెలు కూడా ధరించాలంటూ దారుణంగా ఆడుకున్నారు. ఈ మేరకు చిన్మయి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
ఈ పోస్ట్ క్షణాల్లోనే వైరల్ గా మారింది. ఇక నిన్న దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా హీరోయిన్ల బట్టలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు శివాజీ. మీ సామాన్లు కనపడేలా బట్టలు వేసుకుంటే, మీకే ఇబ్బందని కామెంట్స్ చేశారు సినీ నటుడు శివాజీ. మీరు ఇలాంటి బట్టలు వేసుకుంటే పైకి నవ్వుతారు కానీ ఇలాంటి బట్టలు వేసుకుంది దరిద్రపు ము**డా అని లోపల తిట్టుకుంటారని వ్యాఖ్యానించారు. క్లిక్
Read More..






