నా బాడీ, నా ఇష్టం..అన‌సూయ అదిరిపోయే కౌంట‌ర్‌

by velandi.Saikiran |   (  Updated:2025-12-23 07:12:05  IST  )

నటుడు శివాజీ చేసిన కామెంట్లకు కౌంటర్ గా అనసూయ ఈ పోస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది. ఆయన పేరు ప్రస్తావించకుండా కౌంటర్

నా బాడీ, నా ఇష్టం..అన‌సూయ అదిరిపోయే కౌంట‌ర్‌
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్ పై నటుడు శివాజీ చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పొట్టి బట్టలు కాకుండా, సంప్రదాయ దుస్తుల్లో లేదా చీరకట్టులో కనిపించాలని శివాజీ కామెంట్స్ చేశారు. అయితే ఈ వ్యాఖ్యల నేపథ్యంలో సింగర్ చిన్మయి ఇప్పటికే రియాక్ట్ కాగా, తాజాగా యాంకర్ అనసూయ కూడా స్పందించారు. నా శరీరం నా ఇష్టం... ఇది మీది కాదు, మేం ఇలాగే ఉంటాం అన్న రేంజ్ లో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు అనసూయ.

నటుడు శివాజీ చేసిన కామెంట్లకు కౌంటర్ గా అనసూయ ఈ పోస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది. ఆయన పేరు ప్రస్తావించకుండా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఈ ట్వీట్ క్షణాల్లోనే వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజెన్స్ ర‌క‌ర‌కాలుగా రియాక్ట్ అవుతున్నారు. శివాజీ పేరు పెట్టి, కౌంటర్ ఇస్తే బాగుండని అనసూయను కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. ఇక మరి కొంతమంది అయితే, ఇన్నాళ్లకు అనసూయ కరెక్ట్ గా రియాక్ట్ అయ్యారని ప్రశంసిస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఇప్పటికే శివాజీ వ్యాఖ్యలపై చిన్మయి స్పందించారు. మేం చీరలు కాదు నువ్వు ధోతి, బొట్టు పెట్టుకో? అంటూ కౌంటర్ ఇచ్చారు. క్లిక్

Read More..

శివాజీకి చిన్మయి స్ట్రాంగ్ కౌంట‌ర్‌..నువ్వు కూడా ధోతీ క‌ట్టుకో అంటూ!

శివాజీకి భ‌య‌ప‌డి, ఫుల్‌గా బట్టలు వేసుకొని వచ్చా !

Next Story