శివాజీకి భ‌య‌ప‌డి, ఫుల్‌గా బట్టలు వేసుకొని వచ్చా !

by velandi.Saikiran |

న‌టి అదితి భావరాజు షాకింగ్ కామెంట్స్ చేశారు. న‌టుడు శివాజీ వస్తారని తెలిసి, ఫుల్‌గా బట్టలు వేసుకొని వచ్చానంటూ

శివాజీకి భ‌య‌ప‌డి, ఫుల్‌గా బట్టలు వేసుకొని వచ్చా !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ సింగ‌ర్, అప్ క‌మింగ్ న‌టి అదితి భావరాజు షాకింగ్ కామెంట్స్ చేశారు. న‌టుడు శివాజీ వస్తారని తెలిసి, ఫుల్‌గా బట్టలు వేసుకొని వచ్చానంటూ బాంబ్ పేల్చారు. పొట్టి బ‌ట్టలు వేసుకుని వ‌స్తే, ఆయన తిడతారని వ్యాఖ్యానించారు అదితి భావరాజు ( Aditi Bhavaraju) దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ( Dhandoraa Pre-Release Event ) సంద‌ర్భంగా అదితి భావరాజు ఈ కామెంట్స్ చేయ‌గా, వైర‌ల్ గా మారాయి. శివాజీ, నవదీప్, నందు, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమానే దండోరా. ఈ సినిమాకు మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు.

అదితి భావరాజు ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. డిసెంబర్ 25వ తేదీన ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్ర బృందం. ఈ నేపథ్యంలోనే పొట్టి బట్టలపై అదితి భావ‌రాజు కామెంట్స్ చేశారు. ఇక అంతకుముందు ఇదే ఈవెంట్ లో హీరోయిన్ల పొట్టి బ‌ట్ట‌ల‌పై శివాజీ హాట్ కామెంట్స్ చేశారు. సామాన్లు బాగా క‌నిపించేలా బ‌ట్ట‌లు వేసుకుంటే, అది అందంగా కాదంటూ హాట్ కామెంట్స్ చేశారు శివాజీ. హీరోయిన్లు సంప్రాదాయ బ‌ట్ట‌లు వేసుకోవాల‌ని సూచ‌న‌లు చేశారు. క్లిక్

Next Story