- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
"కూలీ" ఫస్ట్ రివ్యూ.. ఆ 20 నిమిషాలే పైసా వసూల్.. రేటింగ్ ఎంతంటే !
ఉమైర్ సంధు కూలీ సినిమా గ్రాండ్ విక్టరీ కొడుతుందని పోస్టులు ఈ సినిమా ఫస్ట్ రివ్యూ కూడా ఇచ్చేశాడు.

దిశ, వెబ్ డెస్క్ : ఎంతో ఆతృతగా సినిమా ప్రియులు ఎదురుచూస్తున్న సినిమా కూలీ ( Coolie). సూపర్ స్టార్ రజినీ కాంత్ ( Rajinikanth) హీరోగా.. లోకేష్ కనకరాజు (Lokesh Kanagaraj) దర్శకత్వంలో ఈ కూలీ సినిమా వస్తోంది. పెన్ స్టూడియోస్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాకు కళానిధి మారన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అనిరుధ్ ఎప్పటిలాగే అదిరిపోయే మ్యూజిక్ కూడా అందించాడు.
ఆగస్టు 14వ తేదీన అంటే మరో మూడు రోజుల్లోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇందులో నాగార్జున, షాహిర్, ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ రివ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమాకు 3.5 రేటింగ్ కూడా ఇచ్చేశారు.
సినిమా క్రిటిక్ ఉమైర్ సంధు మొదటి నుంచి రజనీకాంత్ నటించిన కూలీ సినిమా గ్రాండ్ విక్టరీ కొడుతుందని పోస్టులు పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా ఫస్ట్ రివ్యూ కూడా ఇచ్చేశాడు. ఈ సినిమాలో రజనీకాంత్ వన్ మ్యాన్ షో ఉంటుందని పేర్కొన్నాడు. అతని పాత్రే చాలా కీలకమన్నాడు. స్టోరీ అలాగే స్క్రీన్ ప్లే ఆవరేజ్ గా ఉన్నప్పటికీ క్లైమాక్స్ మాత్రం అదిరిపోతుందని చెప్పాడు. ముఖ్యంగా చివర్లో 20 నిమిషాల సీన్... దుమ్ము రేపుతుందని పేర్కొన్నాడు. సినిమా రేటింగ్ కూడాఐదుకు 3.5 ఇచ్చాడు.
Read More..
వార్ 2 ఈవెంట్ లో బాలయ్యను అవమానించిన ఎన్టీఆర్.. ఇదిగో వీడియో ?
War 2: ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫాన్స్ మధ్య వార్... పచ్చి బూతులతో !






