- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభాస్ ను టెన్షన్ పెడుతోన్న ‘R’ లెటర్ ..?
R లెటర్ పైన రాఘవేంద్ర, రెబల్, రాధే శ్యామ్ తాజాగా రాజా సాబ్ సినిమాలు చేశారు ప్రభాస్.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ అగ్ర హీరో ప్రభాస్ తాజాగా నటించిన సినిమా ది రాజా సాబ్. సంక్రాంతి కానుకగా జనవరి 8వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే సంక్రాంతి హాలిడేస్ ఉండడంతో పాటు ప్రభాస్ సినిమా కావడం కారణంగా కలెక్షన్స్ విపరీతంగానే వస్తున్నాయి. మొదటి రోజున రూ.120కి పైగా కోట్లు కొల్లగొట్టింది ది రాజా సాబ్ సినిమా. ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహించగా, ముగ్గురు హీరోయిన్లు నటించారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ మెరిసిన సంగతి తెలిసిందే.
ప్రభాస్ ను టెన్షన్ పెడుతున్న R లెటర్?
పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిన ప్రభాస్ ను R లెటర్ టెన్షన్ పడుతోందట. ఈ లెటర్ తో వచ్చిన సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకుంటున్నట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. గతంలో R లెటర్ పైన రాఘవేంద్ర, రెబల్, రాధే శ్యామ్ తాజాగా రాజా సాబ్ సినిమాలు చేశారు ప్రభాస్. అయితే గతంలో విడుదలైన మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ ముందు పెద్దగా ఆడలేదు. ప్రస్తుతం ది రాజా సాబ్ థియేటర్ లో నడుస్తోంది. అయితే ఈ సినిమా రిలీజ్ కంటే ముందు, ఓ రేంజ్ లో హిట్ అవుతుందని అందరూ అంచనా వేసుకున్నారు. మారుతి ఇచ్చిన స్పీచ్ తో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. కానీ రిలీజ్ అయిన తర్వాత, నెగిటివ్ టాక్ వస్తోంది. అటు కలెక్షన్స్ మాత్రం బాగానే రాబడుతోంది ది రాజా సాబ్. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ కు R లెటర్ అచ్చి రావడంలేదని అంటున్నారు.
READ MORE .....
ది రాజా సాబ్ ఎఫెక్ట్...రెమ్యూనరేషన్ తగ్గించిన ప్రభాస్ ?
రాజాసాబ్‌లో మైండ్ బ్లోయింగ్ సీన్లు యాడ్.. అఫీషియల్ వీడియో వైరల్






