రాజాసాబ్‌లో మైండ్ బ్లోయింగ్ సీన్లు యాడ్.. అఫీషియల్ వీడియో వైరల్

by Gugulothu.Kavitha |   (  Updated:2026-01-11 11:56:50  IST  )

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్(Prabhas) హీరోగా న‌టించిన `ది రాజాసాబ్`(The Raja Saab) థియేటర్లలో రిలీజ్ అయి నెగిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

రాజాసాబ్‌లో మైండ్ బ్లోయింగ్ సీన్లు యాడ్.. అఫీషియల్ వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్(Prabhas) హీరోగా న‌టించిన `ది రాజాసాబ్`(The Raja Saab) థియేటర్లలో రిలీజ్ అయి నెగిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన ఈ సినిమా వాటిని అందుకోవ‌డంలో విఫ‌ల‌మ‌వ్వ‌డంతో తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. సినిమాకు నెగిటివ్ రివ్యూలు.. థియేట‌ర్ల వ‌ద్ద ప‌బ్లిక్ టాక్‌తో ఫస్ట్ షో నుంచే నెగెటివ్ తెచ్చుకుంది. అయితే డైరెక్టర్ మారుతి ఎంతో కాన్పిడెంట్‌గా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది.. అవ్వకపోతే ప్రభాస్ ఫ్యాన్స్ మా ఇంటికి వచ్చి అడగవచ్చు అని ఎంతో కాన్ఫిడెంట్‌గా చెప్పిన సంగతి తెలిసిందే.

ఇక అందుకు భిన్నంగా సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో డైరెక్టర్ మారుతి ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసారు. అలాగే సినిమాలో కొన్ని స‌న్నివేశాలు తొల‌గించిన‌ట్లు అభిమానులు అభిప్రాయం వ్య‌క్తం చేసిన నేప‌థ్యంలో వాటిలో కొన్నింటిని అద‌నంగా క‌లుపుతున్న‌ట్లు తెలిపారు. ద్వితియార్దాన్ని కాస్త ట్రిమ్ చేసిన‌ట్లు వెల్ల‌డించారు. అలాగే తొలగించిన ప్ర‌భాస్ స‌న్నివేశాలు యాడ్ చేసిన‌ట్లు తెలిపారు. ఆదివారం నుంచి న్యూ వెర్ష‌న్ అందుబాటులో ఉంటుందని.. ప్ర‌త్యేకించి ప్ర‌భాస్ ఓల్డ్ గెట‌ప్‌కు సంబంధించిన స‌న్నివేశాలు యాడ్ చేశామని చెప్పిన విషయం విధితమే.

ఈ క్రమంలో ఓ స్పెషల్ వీడియో షేర్ చేశారు మూవీ టీమ్.. ‘రాజాసాబ్ నుండి అప్‌సైడ్ డౌన్ ఫైట్ సీక్వెన్స్ ఇప్పుడు అన్ని థియేటర్లలో ప్రదర్శించబడుతోంది.. అడ్రినలిన్ నిండిన పెద్ద స్క్రీన్ అనుభవం కోసం మీ టిక్కెట్లను ఇప్పుడే బుక్ చేసుకోండి’ అని ప్రభాస్ ఓల్డ్ మ్యాన్ లుక్‌లో ఫైటింగ్ చేస్తున్న వీడియో షేర్ చేశారు. మరి ఈ సీన్స్‌తో అయిన సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటుందేమో చూడాల్సి ఉంది.

READ MORE .....

ప్రభాస్ ను టెన్ష‌న్ పెడుతోన్న‌ ‘R’ లెట‌ర్ ..?

ది రాజా సాబ్ ఎఫెక్ట్‌...రెమ్యూన‌రేష‌న్ త‌గ్గించిన ప్ర‌భాస్ ?

Next Story