- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ది రాజా సాబ్ ఎఫెక్ట్...రెమ్యూనరేషన్ తగ్గించిన ప్రభాస్ ?
ది రాజా సాబ్ సినిమాకు ప్రభాస్ కేవలం రూ. 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు టాక్ నడుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ది రాజా సాబ్. సంక్రాంతి కానుకగా జనవరి 8వ తేదీన ఈ సినిమా రిలీజ్ అయింది. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా జనవరి 9వ తేదీన రిలీజ్ కావాల్సి ఉండగా, ఒకరోజు ముందుగానే ప్రీమియర్లు పడిపోయాయి. చాలా రోజుల తర్వాత ప్రభాస్ సినిమా రావడంతో జనాలు ఎగబడి చూస్తున్నారు. మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ మాత్రం అదరగొడుతోంది ఈ సినిమా.
ది రాజా సాబ్ కోసం ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంత అంటే?
మారుతి దర్శకత్వంలో వచ్చిన ది రాజా సాబ్ సినిమా కోసం ప్రభాస్ రెమ్యూనరేషన్ తక్కువగానే తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ ప్రముఖుల సమాచారం ప్రకారం, ఒక్క సినిమాకు రూ.150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటాడట ప్రభాస్. కానీ, ది రాజా సాబ్ సినిమాకు మాత్రం కేవలం రూ. 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు టాక్ నడుస్తోంది. జోనర్ చేంజ్, సెట్ కోసం భారీగా ఖర్చయిన నేపథ్యంలో రెమ్యూనరేషన్ తక్కువగా తీసుకోవాలని ప్రభాస్ నిర్ణయం తీసుకున్నారట.
ఇక అటు ఈ సినిమా దర్శకుడు మారుతి రూ.18 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు చెబుతున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ రూ.5 కోట్లు తీసుకోగా, రిద్ది కుమార్ ఏకంగా మూడు కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. మాళవిక రెండు కోట్లు కాగా నిధి అగర్వాల్ కు రూ.1.5 కోట్లు మాత్రమే ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమా బడ్జెట్ రూ.450 కోట్లు దాటినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
READ MORE .....
ప్రభాస్ ను టెన్షన్ పెడుతోన్న ‘R’ లెటర్ ..?
రాజాసాబ్‌లో మైండ్ బ్లోయింగ్ సీన్లు యాడ్.. అఫీషియల్ వీడియో వైరల్






