‘పెద్ది’ నా సినీ లైబ్రరీలో మొదటి స్థానంలో ఉంటుంది.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన రామ్ చరణ్

by Pulgam srinivas |   (  Updated:2026-05-24 05:59:00  IST  )

భోపాల్‌లో జరిగిన ‘పెద్ది’ ఈవెంట్‌లో రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘పెద్ది’ నా సినీ లైబ్రరీలో మొదటి స్థానంలో నిలుస్తుందని తెలిపాడు.

‘పెద్ది’ నా సినీ లైబ్రరీలో మొదటి స్థానంలో ఉంటుంది.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన రామ్ చరణ్
X

దిశ, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా ‘పెద్ది’ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించాడు. జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్‌గా నటించగా, బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. ఈ సినిమాను జూన్ 4న విడుదల చేయనున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో మూవీ బృందం నిన్న రాత్రి భోపాల్లో భారీ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈవెంట్‌లో భాగంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. “భోపాల్ ప్రజలకు ధన్యవాదాలు. మా ఈవెంట్‌కు ఇంత పెద్ద స్థాయిలో జనాలు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రభుత్వం, పోలీస్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు” అని అన్నారు.

ఇక ‘పెద్ది’ సినిమా గురించి మాట్లాడుతూ.. “ఇది అద్భుతమైన సినిమా. నా సినీ లైబ్రరీలో ‘పెద్ది’ చిత్రం మొదటి స్థానంలో నిలుస్తుంది. అంత గొప్ప స్థాయిలో ఈ మూవీ ఉండబోతోంది. ఇందులోని ఎమోషన్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది” అని చెప్పుకొచ్చాడు. అలాగే హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి మాట్లాడుతూ.. “ఈ సినిమాలో జాన్వీ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది” అని అన్నారు. దర్శకుడు బుచ్చిబాబు సనా ఈ సినిమా కోసం ఎంతగానో కష్టపడ్డారని, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి ఒక పెద్ద పిల్లర్‌లా నిలిచారని పేర్కొన్నారు. “ఏఆర్ రెహమాన్ సంగీతం మా సినిమా స్థాయిని మరింత పెంచింది. అలాగే ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఈ మూవీ మంచి గుర్తింపు తీసుకురావాలని కోరుకుంటున్నాను” అని రామ్ చరణ్ తెలిపారు. ప్రస్తుతం రామ్ చరణ్ చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.

బుమ్రాకు చెర్రీ క్షమాపణలు

Peddi: ఈరోజు ఆ సమయానికి రిలీజ్ కానున్న ‘హెల్లల్లల్లో’ సాంగ్

Next Story