బుమ్రాకు చెర్రీ క్షమాపణలు

by Muthe.Rajitha |   (  Updated:2026-05-24 05:57:18  IST  )

భారత క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రాకు నటుడు రామ్ చరణ్ క్షమాపణలు తెలిపారు.

బుమ్రాకు చెర్రీ క్షమాపణలు
X

దిశ, వెబ్ డెస్క్ : బుచ్చిబాబు, రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న "పెద్ది"సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఈ క్రమంలో శనివారం భోపాల్‌లో పెద్ది మూవీ ప్రమోషన్ ఈవెంట్ జరిగింది. అయితే ఈ ఈవెంట్‌లో రామ్ చరణ్, భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాను పొరపాటున "ఫుట్‌బాల్ ప్లేయర్" అని సంబోధించడం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తీవ్ర సంచలనానికి దారితీసింది. ఈ కార్యక్రమంలో చెర్రీ చేసిన ఈ వ్యాఖ్యల తాలూకు వీడియో క్లిప్స్ నెట్టింట వైరల్‌గా మారడంతో, నెటిజన్లు, క్రికెట్ అభిమానులు ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఒక అగ్ర నటుడికి, దేశంలోనే మోస్ట్ పాపులర్ క్రికెటర్ అయిన బుమ్రా గురించి కనీస అవగాహన లేదా అంటూ "క్రికెట్ గురించి తెలియదా?", "ఇంత పెద్ద స్టార్ ఇలాంటి తప్పు చేయడం సిగ్గుచేటు" అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలుపెట్టారు.

ఈ వివాదం ముదరడంతో స్పందించిన రామ్ చరణ్, ఈవెంట్ ముగిసిన వెంటనే క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేసారు. కేవలం పొరపాటున మాత్రమే అలా మాట్లాడానని, కొన్నిసార్లు తాను పేర్లు మర్చిపోతుంటానని అన్నారు. బుమ్రా అంటే తనకు చాలా గౌరవం అని, తన ఆటకు వీరాభిమానిని అని, బుమ్రా ప్రతి భారతీయుడు గర్వించేలా దేశానికి విజయాలు సాధించి పెట్టారని అంటూ.. బుమ్రాను ట్యాగ్ చేసారు. రామ్ చరణ్ తన తప్పును త్వరగానే గ్రహించి వ్యక్తిగతంగా సర్దుబాటు చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో ఇప్పటికీ హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతూనే ఉంది.

‘పెద్ది’ నా సినీ లైబ్రరీలో మొదటి స్థానంలో ఉంటుంది.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన రామ్ చరణ్

Next Story