Peddi: ఈరోజు ఆ సమయానికి రిలీజ్ కానున్న ‘హెల్లల్లల్లో’ సాంగ్

by Pulgam srinivas |   (  Updated:2026-05-24 05:58:13  IST  )

‘పెద్ది’ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘హెల్లల్లల్లో’ సాంగ్‌ను ఈరోజు ఉదయం 11:07 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు.

Peddi: ఈరోజు ఆ సమయానికి రిలీజ్ కానున్న ‘హెల్లల్లల్లో’ సాంగ్
X

దిశ, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న ‘పెద్ది’ చిత్రంలోని ‘హెల్లల్లల్లో’ స్పెషల్ సాంగ్‌పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ పాటకు సంబంధించిన ప్రోమోను రెండు రోజుల క్రితమే విడుదల చేయగా, అందులో శృతిహాసన్, జాన్వీ కపూర్ అందాలు, రామ్ చరణ్ డ్యాన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దీంతో పూర్తి పాట ఎప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఏఆర్ రెహమాన్ మరియు ఆయన బృందం నిన్న భోపాల్లో జరిగిన ‘పెద్ది’ ఈవెంట్‌లో ‘హెల్లల్లల్లో’ పాటను లైవ్‌గా ప్రదర్శించారు.

ఈ పెర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. పాట ట్యూన్ అద్భుతంగా ఉండడంతో దీనికి సంబంధించిన విజువల్స్ ఎప్పుడు బయటకు వస్తాయా అని ఫ్యాన్స్ మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా మూవీ యూనిట్ ‘హెల్లల్లల్లో’ సాంగ్‌ను ఈరోజు ఉదయం 11:07 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఈ పాట ప్రోమోకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తోంది. శృతిహాసన్, జాన్వీ కపూర్ గ్లామర్‌తో పాటు రామ్ చరణ్ డ్యాన్స్ కూడా అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ఉంటే ఈ పాట నెక్స్ట్ లెవల్‌లో హిట్ అవుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

‘పెద్ది’ నా సినీ లైబ్రరీలో మొదటి స్థానంలో ఉంటుంది.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన రామ్ చరణ్

Next Story