- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kota Srinivasa Rao: టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత
టాలీవుడ్ ఇండస్ట్రీలో పెను విషాదం చోటుచేసుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ ఇండస్ట్రీలో పెను విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతి చెందారు. 83 సంవత్సరాలు ఉన్న కోట శ్రీనివాసరావు గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన తాజా పరిస్థితి... విషమించడంతో ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు నిర్ధారించారు.
అయితే.. కోట శ్రీనివాసరావు... తన సినిమా కెరియర్లో ఎన్నో సక్సెస్ లు అందుకున్నారు. సుమారు 750 కి పైగా సినిమాలలో కోట శ్రీనివాసరావు నటించారు. తెలుగులోనే కాకుండా మలయాళం, కన్నడ, హిందీ, తమిళం ఇలా అన్ని భాషల్లో కూడా నటించారు కోటా శ్రీనివాసరావు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చారు కోట శ్రీనివాసరావు. 2015లో పద్మశ్రీ అవార్డు కూడా దక్కించుకున్నారు. ఆయనకు మొత్తం తొమ్మిది నంది అవార్డులు వచ్చాయి. కోట శ్రీనివాసరావుకు ఇద్దరు కుమార్తెలు, కుమారులు కూడా ఉన్నారు. ఇక ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతి చెందిన నేపథ్యంలో ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
Read More..






