- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోట శ్రీనివాస రావు మృతిపై తెలంగాణ మంత్రుల సంతాపం
తెలుగు చిత్ర పరిశ్రమ(Tollywood)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు(83) కన్నుమూశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు చిత్ర పరిశ్రమ(Tollywood)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు(83) కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. తాజాగా ఆయన మరణవార్త తెలిసి తెలంగాణ మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy), పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) దిగ్భ్రాంతికి గురయ్యారు. కోట మృతిపట్ల సంతాపం ప్రకటించారు. ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న కోట శ్రీనివాసరావు మృతి కలిచివేసిందని.. ఆయన లేని లోటు తీర్చలేనిదని అన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
1942 జులై 10న కృష్ణాజిల్లా కంకిపాడులో కోట శ్రీనివాసరావు(Kota Srinivasa Rao) జన్మించారు. 1978లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ప్రాణం ఖరీదు సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. 40 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో కొనసాగారు. 750కి పైగా చిత్రాల్లో నటించారు. 1999-2004 వరకు విజయవాడ తూర్పు నియోజకర్గ భాజపా ఎమ్మెల్యేగా పనిచేశారు.
Read More..
కోట శ్రీనివాసరావు చివరి ఫోటో ఇదే..!
కోట శ్రీనివాస రావు కన్నుమూత.. కన్నీరు పెట్టుకున్న బాబూ మోహన్






