- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోట శ్రీనివాసరావు చివరి ఫోటో ఇదే..!
టాలీవుడ్ స్టార్ నటులు కోట శ్రీనివాసరావు ( Kota Srinivasa Rao) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ స్టార్ నటులు కోట శ్రీనివాసరావు ( Kota Srinivasa Rao) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కోట శ్రీనివాసరావు... ఇవాళ ఉదయం 4 గంటల సమయంలో ఆయన ఇంట్లోనే మరణించారు. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో... కోట శ్రీనివాసరావు కు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది.
టాలీవుడ్ విలన్ కోట శ్రీనివాసరావు... చివరి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల.. అంటే దాదాపు నెల రోజుల కిందట కోట శ్రీనివాసరావు ఇంటికి బండ్ల గణేష్ (Bandla Ganesh) వెళ్లారు. ఈ సందర్భంగా... కోట శ్రీనివాసరావు తో ఫోటో దిగి మరి... ఎమోషనల్ అయ్యారు బండ్ల గణేష్. అయితే ఆ సందర్భంగా కోట శ్రీనివాసరావు షుగర్ వ్యాధితో బాధపడుతున్నట్లు.. స్పష్టమైంది. అంతేకాదు ఆ ఫోటోలో.. కోట శ్రీనివాసరావు కాలికి... కట్టు కూడా కట్టారు వైద్యులు.
అలాగే అందులో చాలా సన్నబడి గుర్తుపట్టలేనంతగా మారిపోయారు కోట శ్రీనివాసరావు. అంతేకాదు డయాలసిస్ కారణంగా కాలి వేలిని కూడా తొలగించారని సమాచారం. ఆ ఫోటోను చూసి అభిమానులు షాక్ అయ్యారు. ఇక ఇప్పుడు.. ఆయన మృతి చెందడంతో.. టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
Read More..
కోట శ్రీనివాస రావు కన్నుమూత.. కన్నీరు పెట్టుకున్న బాబూ మోహన్






