- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒకే కాన్పులో నలుగురు ఆడపిల్లలు.. ఎనిమిదికి చేరిన సంతానం
ఆస్ట్రేలియాలో ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు కవల ఆడపిల్లలకు జన్మనివ్వడం వైద్యపరంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

దిశ, వెబ్ డెస్క్: ఒకే కాన్పులో నలుగురు కవల ఆడపిల్లలకు జన్మనివ్వడం వైద్యపరంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకోగా.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే కొత్తగా పుట్టిన నలుగురి ఆడపిల్లలతో ఆ కుటుంబానికి ఊహించని సవాళ్లను తెచ్చిపెట్టింది. ఈ నలుగురు పాపల రాకతో ఆ దంపతులకు సంతానం సంఖ్య ఒకేసారి ఎనిమిదికి చేరింది. ఒకేసారి నలుగురు బిడ్డలు పుట్టడం ఎంతో ఆనందాన్ని ఇచ్చినప్పటికీ, పెద్ద కుటుంబం కావడంతో వారి పోషణ, నిత్యవసరాలు, రవాణా ఖర్చులు ఆ దంపతులకు భారంగా మారాయి.
కుటుంబం అంతా కలిసి బయటకు ప్రయాణించాలంటే ప్రస్తుతమున్న చిన్న కారు సరిపోకపోవడంతో, ఎనిమిది మంది పిల్లలు సురక్షితంగా ప్రయాణించేందుకు వీలుగా ఒక పెద్ద వ్యాన్ లేదా 10-సీటర్ కారును కొనుగోలు చేయాలని ఆ దంపతులు నిర్ణయించుకున్నారు. వాహన కొనుగోలు, ఇతర ప్రాథమిక ఖర్చుల కోసం వారు ఆన్‌లైన్ ద్వారా విరాళాల సేకరణ (ఫండ్ రైజింగ్) ప్రారంభించారు. అత్యంత అరుదైన ఈ ఘటన, వారి విరాళాల సేకరణ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్ల దృష్టిని విపరీతంగా ఆకట్టుకుంటోంది. అలాగే పెద్ద సంఖ్యలో ఆ దంపతులకు మద్దతు లభిస్తున్నట్లు తెలుస్తుంది.






