పొట్టి డ్రెస్‌లో కాజల్ అగర్వాల్ గ్లామర్ షో.. ఆకట్టుకుంటున్న తాజా స్టిల్స్

by Pulgam srinivas |   (  Updated:2026-05-27 08:41:54  IST  )

పొట్టి డ్రెస్‌లో క్యూట్ లుక్స్.. కాజల్ అందాలకు ఫ్యాన్స్ ఫిదా.

పొట్టి డ్రెస్‌లో కాజల్ అగర్వాల్ గ్లామర్ షో.. ఆకట్టుకుంటున్న తాజా స్టిల్స్
X

ఒకేసారి ఐదు క్రేజీ ప్రాజెక్ట్స్ కన్ఫర్మ్.. లైనప్‌తో నెటిజన్ల మైండ్ బ్లాక్ చేస్తున్న యంగ్ బ్యూటీ సంజనాదిశ, వెబ్ డెస్క్: ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కాజల్ అగర్వాల్, ఆ తర్వాత ‘చందమామ’, ‘మగధీర’ వంటి బ్లాక్‌బస్టర్ విజయాలతో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అనంతరం అనేక సంవత్సరాల పాటు వెనక్కి తిరిగి చూసుకోకుండా తన కెరీర్‌ను విజయవంతంగా కొనసాగించింది.

కేవలం తెలుగులోనే కాకుండా తమిళ చిత్ర పరిశ్రమలో కూడా ఈ బ్యూటీ చాలా కాలం పాటు టాప్ హీరోయిన్‌గా రాణించింది. అయితే పెళ్లి, అనంతరం ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న కాజల్ ఇప్పుడు మళ్లీ ఫుల్ స్వింగ్‌లో సినిమాలు చేస్తూ బిజీగా మారింది.

ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అయినప్పటికీ ఈ సీనియర్ బ్యూటీ గ్లామర్‌ను మెయింటైన్ చేయడంలో మాత్రం కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది. అనేక సందర్భాల్లో తన అందాలతో అభిమానులను ఆకట్టుకుంటోంది.

తాజాగా కాజల్ తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో లైట్ పింక్ కలర్ పొట్టి డ్రెస్‌లో బెడ్‌పై కూర్చొని చేతిలో కెమెరా పట్టుకుని స్టైలిష్‌గా పోజులు ఇచ్చింది.

అలాగే తన కురులను అందంగా ముందుకు వదిలేసి క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుంది. మొత్తంగా ఈ ఫోటోల్లో కాజల్ తన గ్లామర్‌తో ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తుండగా, ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Photos Courtesy: Instagram

ఒకేసారి ఐదు క్రేజీ ప్రాజెక్ట్స్ కన్ఫర్మ్.. లైనప్‌తో నెటిజన్ల మైండ్ బ్లాక్ చేస్తున్న యంగ్ బ్యూటీ సంజనా

షూటింగ్‌లో కాజల్ విచిత్రమైన అనుభవం.. చారిత్రాత్మక ప్రదేశంలో మూత్రం పోశానంటూ షాకింగ్ కామెంట్స్!

Next Story