షూటింగ్‌లో కాజల్ విచిత్రమైన అనుభవం.. చారిత్రాత్మక ప్రదేశంలో మూత్రం పోశానంటూ షాకింగ్ కామెంట్స్!

by Mallepaka Hamsa |   (  Updated:2026-05-27 08:40:53  IST  )

అంత దూరం వెళ్లే పరిస్థితి లేకపోవడంతో, చుట్టుపక్కల చూసి వేరే దారి లేక అక్కడ ఉన్న ఒక పాత సమాధి మీద మూత్రం పోశాను.

షూటింగ్‌లో కాజల్ విచిత్రమైన అనుభవం.. చారిత్రాత్మక ప్రదేశంలో మూత్రం పోశానంటూ షాకింగ్ కామెంట్స్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని, తన షూటింగ్ రోజుల్లో ఎదురైన ఒక విచిత్రమైన అనుభవాన్ని పంచుకుంది. సినిమా రంగంలో ఉండే గ్లామర్ వెనుక హీరోయిన్లు పడే కష్టాలు ఎలా ఉంటాయో చెప్పే క్రమంలో ఆమె ఈ ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టింది. "నేను ఒక సినిమా షూటింగ్ కోసం ప్రపంచ వింతలలో ఒకటైన జోర్దాన్‌లోని చారిత్రాత్మక ప్రదేశం పెట్రాకు వెళ్లాను. అక్కడ ఒక బ్యూటిఫుల్ సాంగ్ షూట్ చేస్తున్నారు. అయితే నేను చిత్రీకరణ చేస్తున్న ప్రదేశం నుంచి బాత్రూమ్ చాలా దూరంలో ఉంది. ఆ సమయంలో నాకు అత్యవసరంగా బాత్రూమ్ వెళ్లాల్సి వచ్చింది. అంత దూరం వెళ్లే పరిస్థితి లేకపోవడంతో, చుట్టుపక్కల చూసి వేరే దారి లేక అక్కడ ఉన్న ఒక పాత సమాధి మీద మూత్రం పోశాను. అది నా జీవితంలో జరిగిన అత్యంత విచిత్రమైన, అలాగే ఇబ్బందికరమైన సంఘటన" అని చెప్పుకొచ్చింది.

ఆ తర్వాత ఆ ప్రదేశం ప్రాముఖ్యత తెలిసి తనకు చాలా బాధగా అనిపించిందని కూడా ఆమె ఎమోషనల్ అయ్యింది.ఈ విషయం బయటకు రావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరేమో అంతటి చారిత్రాత్మక కట్టడంపై అలా చేయడం తప్పు అని కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం షూటింగ్ స్పాట్స్‌లో ఆడవారికి కనీస సౌకర్యాలు ఉండవని, ఆ అత్యవసర పరిస్థితిలో ఆమె అలా చేయడంలో తప్పులేదంటూ కాజల్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. ఇక కాజల్ అగర్వాల్ సినిమాల విషయానికొస్తే.. ఆమె ప్రస్తుతం వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ బిజీగా గడుపుతోంది. ‘ది ఇండియా స్టోరీ, రామాయణ’ వంటి భారీ ప్రాజెక్ట్స్‌లో కీలక పాత్రలో కనిపించనుంది. షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాలు థియేటర్స్‌లో విడుదల అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి.

పొట్టి డ్రెస్‌లో కాజల్ అగర్వాల్ గ్లామర్ షో.. ఆకట్టుకుంటున్న తాజా స్టిల్స్

Next Story