ఒకేసారి ఐదు క్రేజీ ప్రాజెక్ట్స్ కన్ఫర్మ్.. లైనప్‌తో నెటిజన్ల మైండ్ బ్లాక్ చేస్తున్న యంగ్ బ్యూటీ సంజనా!

by Mallepaka Hamsa |   (  Updated:2026-05-27 06:28:40  IST  )

నటిగా నన్ను నేను నిరూపించుకోవడానికి ఇంతకంటే మంచి లైనప్ దొరకదు. విభిన్నమైన పాత్రలు చేసే అవకాశం వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది.

ఒకేసారి ఐదు క్రేజీ ప్రాజెక్ట్స్ కన్ఫర్మ్.. లైనప్‌తో నెటిజన్ల మైండ్ బ్లాక్ చేస్తున్న యంగ్ బ్యూటీ సంజనా!
X

దిశ, సినిమా: కోలీవుడ్ యంగ్ బ్యూటీ సంజనా కృష్ణమూర్తి విజయ్, విక్రమ్ వంటి స్టార్స్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తన నటన, అందం, అభినయంతో ఫుల్ ఫేమ్ రాబట్టుకుని.. వరుస అవకాశాలు దక్కించుకంటూ టాలీవుడ్, కోలీవుడ్‌లలో మోస్ట్ బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సంజనా తాను నటిస్తున్న అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘నేను లవ్లీ డైరెక్టర్ ఏఎల్ విజయ్ గారి నిర్మాణంలో ఒక సినిమా చేశాను. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇంకా రావాల్సి ఉంది. ఇది పూర్తిగా ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. మూవీ మాత్రం నిజంగా చాలా అద్భుతంగా రూపుదిద్దుకుంది. అలాగే టాలెంటెడ్ డైరెక్టర్ పాండిరాజ్ గారి దర్శకత్వంలో తెరకెక్కిన ‘పరిమళ అండ్ కో’ చిత్రంలో నా పార్ట్ షూటింగ్, డబ్బింగ్ పనులన్నీ పూర్తి చేశాను. ఈ సినిమా జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. థియేటర్లలో ప్రేక్షకులను ఇది బాగా అలరిస్తుందని నమ్ముతున్నాను.

దీంతో పాటుగా విలక్షణ దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ‘డీసీ’ అనే సినిమా షూటింగ్‌ను కూడా నేను కంప్లీట్ చేశాను. ఈ మూవీ కథా నేపథ్యం విభిన్నంగా, పూర్తిగా ఒక సరికొత్త ప్రపంచంలో సాగుతుంది. నేనే స్వయంగా ఈ మూవీలోని కొన్ని సన్నివేశాలను చూశాను, అవి విజువల్‌గా చాలా అమేజింగ్‌గా అనిపించాయి. తమిళంతో పాటు నేను ప్రస్తుతం ఒక స్ట్రెయిట్ తెలుగు సినిమాలో కూడా నటిస్తున్నాను. ఈ సినిమా షూటింగ్ పనులు ప్రస్తుతం చాలా వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే దీని వివరాలు వెల్లడిస్తాము. ఇవే కాకుండా, ‘ప్రిన్స్ పిక్చర్స్’ నిర్మాణంలో నేను మరొక చిత్రం చేస్తున్నాను. రామ్ సాగయ్య గారు తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నేను కెవిన్ సరసన హీరోయిన్‌గా నటిస్తున్నాను. మధురై బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇది. ఈ సినిమా షూటింగ్ పనులు కూడా అతి త్వరలోనే ప్రారంభం కానున్నాయి. నటిగా నన్ను నేను నిరూపించుకోవడానికి ఇంతకంటే మంచి లైనప్ దొరకదు. విభిన్నమైన పాత్రలు చేసే అవకాశం వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది" అని సంజనా కృష్ణమూర్తి చెప్పుకొచ్చింది. ఇక ఈ అమ్మడు లైనప్ మామూలుగా లేదంటూ నెటిజన్లు షాక్ అవుతున్నారు.

అల్లు అర్జున్‌తో కలిసి ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో పని చేయడం నాకు దక్కిన గొప్ప అవకాశం: ఫెమినా

Next Story