అల్లు అర్జున్‌తో కలిసి ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో పని చేయడం నాకు దక్కిన గొప్ప అవకాశం: ఫెమినా

by Mallepaka Hamsa |   (  Updated:2026-05-27 06:29:21  IST  )

అల్లు అర్జున్‌తో కలిసి ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో పని చేయడం తనకు దక్కిన గొప్ప అవకాశమని చెప్పింది.

అల్లు అర్జున్‌తో కలిసి ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో పని చేయడం నాకు దక్కిన గొప్ప అవకాశం: ఫెమినా
X

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘రాకా’ . ఈ క్రేజీ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా, కళ్ళు చెదిరే భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాగా, ఇటీవల విడుదలైన అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో, ఈ భారీ ప్రాజెక్ట్ గురించి తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. మలయాళ చిత్రాల్లో నటించి తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఫెమినా జార్జ్.. ఈ సినిమా ద్వారా టాలీవుడ్‌కు గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది.

ఈ భారీ ప్రాజెక్ట్‌లో భాగం కావడంపై ఫెమినా జార్జ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ తన ఉత్సాహాన్ని, సంతోషాన్ని పంచుకుంది. అల్లు అర్జున్‌తో కలిసి ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో పని చేయడం తనకు దక్కిన గొప్ప అవకాశమని చెప్పింది. సినిమాలో తను పోషించే పాత్రకు సంబంధించిన నిర్దిష్ట వివరాలను అత్యంత గోప్యంగా ఉంచినప్పటికీ, అల్లు అర్జున్, దీపికా పదుకొణేల లాంటి పెద్ద స్టార్స్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా థ్రిల్లింగ్‌గా ఉందని పేర్కొంది. అలాగే ఈ క్రేజీ మల్టీస్టారర్ చిత్రంలో తనతో పాటు బాలీవుడ్ ప్రముఖ నటుడు జిమ్ సర్బ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు ఫెమినా జార్జ్ అధికారికంగా కన్ఫామ్ చేసింది. వీరందరి కలయికతో సినిమా నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుందని హింట్ ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. అల్లు అర్జున్ అభిమానుల్లో జోష్ నింపుతోంది.

ఒకేసారి ఐదు క్రేజీ ప్రాజెక్ట్స్ కన్ఫర్మ్.. లైనప్‌తో నెటిజన్ల మైండ్ బ్లాక్ చేస్తున్న యంగ్ బ్యూటీ సంజనా!

Next Story