- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Samantha: మాజీ భర్త నాగ చైతన్య కోసం వేసుకున్న టాటూ గురించి మాట్లాడిన సమంత.. షాక్‌లో ఫ్యాన్స్?
సంవత్సరం పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: సంవత్సరం పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ.. తనదైన టాలెంట్‌తో ప్రేక్షకుల్ని నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అనేక చిత్రాల్లో అగ్ర హీరోల సినిమాల్లో అవకాశాలు కొట్టేసి.. స్టార్ డమ్ సంపాదించుకున్న ఈ హీరోయిన్ గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి.
పెళ్లై విడాకులు తీసుకున్న సమంత మరో వివాహం చేసుకోబోతుందంటూ నెట్టింట పుకార్లు షికార్లు కొడుతున్నాయి. సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తితో ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టబోతుందని చర్చించుకుంటున్నారు. వీరిద్దరి మ్యారెజ్‌కు ఇరుకుటుంబీకులు కూడా ఒప్పుకున్నారని టాక్. అయితే ఈ క్రమంలో సామ్ గురించి మరో వార్త వైరల్ అవుతోంది.
2024లో ఇన్‌స్టాగ్రామ్‌లో జరిగిన ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ సెషన్‌లో సమంత రూత్ ప్రభు తన అభిమానులతో ఒకసారి ఎంగేజ్ అయింది. నటి అనేక ప్రశ్నలకు కూల్‌గా సమాధానమిచ్చింది. అయితే ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని, భవిష్యత్తులో ఇంక్ చేయించుకోవడం గురించి ఆమెకు ఏవైనా ఆలోచనలు ఉన్నాయా అని స్టార్‌ని అడిగిన అభిమానులలో ఒకరికి.. సమంత ఇచ్చిన సమాధానం ఆమె అభిమానులను ఆశ్చర్యపరిచింది.
ఎందుకంటే భవిష్యత్తులో ఇంక్ చేయించుకోవడాన్ని ఆమె నిర్మొహమాటంగా తిరస్కరించడమే కాకుండా, తన మాజీ భర్త నాగ చైతన్య కోసం టాటూలు వేయించుకోవడం పట్ల ఇలా మాట్లాడినట్లు జనాలు మాట్లాడుకుంటున్నారు. ‘నా చిన్నతనానికి నేను చెప్పేది ఒక్కటే.. ఎప్పుడూ టాటూ వేయించుకోవద్దు. అస్సలు టాటూ వేయించుకోవద్దు. అంటూ మళ్లీ మళ్లీ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సామ్ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.






