- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Naga Chaitanya-Sobhita: అక్కినేని అభిమానులు బిగ్ గుడ్ న్యూస్.. తల్లిదండ్రులు కాబోతున్న నాగచైతన్య-శోభిత!
అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘జోష్’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.

దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘జోష్’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ‘ఏమాయ చేసావే’(Ye Maaya Chesave) చిత్రంతో హిట్ అందుకోవడంతో పాటు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతతో(Samantha) ప్రేమలో పడ్డాడు. కొద్ది కాలం పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరూ పెద్దలను ఒప్పించి 2007లో పెళ్లి చేసుకున్నారు. కానీ వీరి కాపురం ఎక్కువ కాలం నిలవలేదు. మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తర్వాత చైతు, యంగ్ బ్యూటీ శోభిత(Sobhita Dhulipala) కొద్ది కాలంపాటు డేటింగ్ చేశారు. ఇక గత ఏడాది ఆగస్టు నెలలో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఈ విషయాన్ని నాగార్జున(Nagarjuna) అధికారికంగా ప్రకటించడంతో అంతా షాక్‌కు గురయ్యారు. ఇక అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ లవ్ బర్డ్స్ గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు.
ఇక అప్పటి నుంచి శోభిత దూళిపాళ సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తోంది. ఇక నాగచైతన్య విషయానికొస్తే.. పెళ్లి తర్వాత ‘తండేల్’ మూవీతో హిట్ అందుకున్నారు. ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ మైథలాజికల్ థ్రిల్లర్ చేయబోతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, నాగచైతన్య, శోభితకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరిద్దరు కెరీర్‌పై ఫోకస్ పెట్టకుండా పర్సనల్ లైఫ్ విషయంలో ఎంజాయ్ చేయాలని భావిస్తున్నారట. అంతేకాకుండా తమ మొదటిబిడ్డను స్వాగతించేందుకు సిద్ధంగా ఉన్నట్లు టాక్. త్వరలోనే శోభితా తల్లి కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించబోతున్నారట. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలుసుకున్న కొంతమంది ఇది నిజంగా చాలామంది న్యూస్ అని అంటున్నారు. మరికొందరు మాత్రం కొట్టిపారేస్తున్నారు.
Read More : Samantha: మాజీ భర్త నాగ చైతన్య కోసం వేసుకున్న టాటూ గురించి మాట్లాడిన సమంత.. షాక్‌లో ఫ్యాన్స్?






