- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అఖండ-2 క్రిటిక్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..
దుబాయ్ క్రిటిక్ ఉమైర్ సంధూ ఈ సినిమా రివ్యూపై ఎక్స్ లో పోస్ట్ చేశారు. అఖండ-2 ..

దిశ, వెబ్‌డెస్క్: అఖండ-2 చిత్ర నిర్మాణ సంస్థ ఆర్థిక లావాదేవీల సమస్యలో ఇరుక్కోవడంతో.. విడుదల వాయిదా పడింది. దీంతో బాలయ్య ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. తొలుత ప్రీమియర్స్ ను టెక్నికల్ ఇష్యూ వల్ల క్యాన్సిల్ చేస్తున్నామన్న 14 రీల్స్ ప్లస్.. కాసేపటికే చిత్ర విడుదలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. త్వరలోనే కొత్త విడుదల తేదీ వెల్లడిస్తామని తెలిపింది. కాగా.. అఖండ-2 సినిమా క్రిటిక్స్ రివ్యూ మాత్రం సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది.
దుబాయ్ క్రిటిక్ ఉమైర్ సంధూ ఈ సినిమా రివ్యూపై ఎక్స్ లో పోస్ట్ చేశారు. అఖండ-2 పైసా వసూల్ సినిమా అని పేర్కొన్నారు. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా ఉందని, హార్ట్ కోర్ బాలయ్య ఫ్యాన్స్ కు విందుభోజనంలా సినిమా ఉండబోతోందన్నారు. బాలయ్య డైలాగ్ డెలివరీ, BGM, యాక్షన్ సీన్స్.. స్క్రీన్లు దద్దరిల్లేలా ఉన్నాయని చెప్పారు. బాలకృష్ణ చెప్పే ఒక్కో డైలాగ్ ప్రేక్షకులచేత చప్పట్లు కొట్టిస్తాయన్నారు. క్లైమాక్స్ మాత్రం అదిరిపోయేలా ఉందని, మాస్ ఆడియన్స్ ను అఖండ-2 ఒక పండుగ అని తెలిపారు.
అయితే.. ఉమైర్ సంధు ఇచ్చే రివ్యూలను ఫ్యాన్స్ చాలా వరకూ నమ్మరు. ఎందుకంటే సినిమా సూపర్, డూపర్, బంపర్ హిట్ అని ఇచ్చిన రివ్యూల్లో చాలా వరకూ ఫెయిల్యూర్లే ఉన్నాయి. అందుకే అఖండ-2 సినిమా రిలీజయ్యాకే అసలు రివ్యూ ఏంటో తెలుస్తుందన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్.. అంతలోనే రిలీజ్ ను పోస్ట్ పోన్ చేసి.. అభిమానుల ఆశలపై 14 రీల్స్ ప్లస్ నీళ్లు చల్లింది.
Read More..
BIG NEWS: అఖండ-2 విడుదల వాయిదా.. ప్రకటించిన నిర్మాణ సంస్థ
అఖండ -2 రిలీజ్ ఎప్పుడు? ప్రొడ్యూసర్ ను పొట్టు పొట్టు తిడుతున్న ఫ్యాన్స్






